బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళను బండ బూతులు తిడుతూ జైలుకు ఉత్తరాలు, నేను చదవలేను !

అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ను బండబూతులు తిడుతూ, శపిస్తూ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు ఉత్తరాలు పొటెత్తడంతో ఆమె వర్గీయులు హడలిపోతున్నారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నాటరాజన్ ను బండబూతులు తిడుతూ, శపిస్తూ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు ఉత్తరాలు పొటెత్తడంతో ఆమె వర్గీయులు హడలిపోతున్నారు.

జయలలిత మరణానికి కారణం అయిన శశికళ పతనం అయిపోతుందని శాపిస్తూ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు 100కు పైగా ఉత్తరాలు వచ్చినట్లు జైలు అధికార వర్గాలు తెలిపాయి.

శశికళ అడ్రస్ ఇదే

శశికళ అడ్రస్ ఇదే

శశికళను శాపిస్తూ 100కు పైగా ఇప్పటి వరకు ఉత్తరాలు వచ్చాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికార వర్గాలు తెలిపాయి. శశికళ, సెంట్రల్ జైలు, పరప్పన అగ్రహార, బెంగళూరు -560100 చిరుమానాతో ఉత్తరాలు వస్తున్నాయి.

బూతులు తిడుతూ

బూతులు తిడుతూ

జయలలిత మరణించడానికి నువ్వే కారణం అంటూ తమిళంలో తిడుతూ శశికళకు ఉత్తరాలు రాశారని జైలు అధికారులు అంటున్నారు. జయలలిత చనిపోవడానికి కారణం అనారోగ్యం కాదు, ప్రణాళిక ప్రకారం ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ ఉత్తరాలు రాసి పంపించారు.

కుట్ర చేసింది ఎవరు ?

కుట్ర చేసింది ఎవరు ?

జయలలిత హత్యకు శశికళ కుట్ర చేశారని ఉత్తరాల్లో ఆరోపించారు. మాకు ఎంతో ఇష్టం అయిన అమ్మను నువ్వు చంపేశావు, నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అంటూ శశికళను బండబూతులు తిడుతూ ఉత్తరాలు రాశారని వెలుగు చూసింది.

నరకయాతన అనుభవిస్తావు

నరకయాతన అనుభవిస్తావు

నీకు విశ్వాసం లేదు, నీకు కృతజ్ఞత లేదు, నువ్వు వెన్నుపోటుదారువి, నీకు జీవితాన్ని, అన్ని ఇచ్చిన అమ్మను మోసం చేశావు, గుర్తుంచుకో నువ్వు చేసిన నీచపు పనులకు అంతకు అంత అనుభవిస్తావు, క్షణక్షణం నరకయాతన అనుభవిస్తావు అంటూ ఉత్తరాలు రాశారు.

చిన్నమ్మకు జ్వరం వచ్చేసింది

చిన్నమ్మకు జ్వరం వచ్చేసింది

శశికళకు రాసిన ఉత్తరాలు ఇళవరసి చదివారని, అభ్యంతరంగా ఉన్న ఉత్తరాలను ఆమె చించేశారని జైలు అధికారులు అంటున్నారు. మొదట్లో శశికళ కూడా ఈ ఉత్తరాలు చదివేవారని, తరువాత వాటిని చూడటం మానేశారని అధికారులు తెలిపారు.

ఉత్తరాలు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ?

ఉత్తరాలు వచ్చింది ఎక్కడి నుంచి అంటే ?

తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో సహ తిరుచ్చాపల్లి, కరూర్, దిండిగల్, మదురై, ధర్మపురి, సేలం, క్రిష్ణగిరి తదితర ప్రాంతాల నుంచి శశికళకు ఉత్తరాలు రాశారని జైలు అధికారులు అంటున్నారు.

English summary
Incarcerated AIADMK leader Sasikala Natarajan has received a barrage of letters from Tamil Nadu, accusing her of killing J Jayalalithaa. Angry letter lriters have said their curses will haunt Sasikala for ever.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X