బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారులు అడిగే ప్రశ్నలు ముందుగానే చెప్పండి: కోర్టులో శశికళ పిటిషన్, నో చాన్స్ !

విదేశీ మారకద్రవ్యం (ఫెరా) మోసం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలను తనకు ముందుగానే చెప్పాలని మనవి చేస్తూ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ చెన్నైలోని ఎగ్మూర

|
Google Oneindia TeluguNews

చెన్నై: విదేశీ మారకద్రవ్యం (ఫెరా) మోసం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలను తనకు ముందుగానే చెప్పాలని మనవి చేస్తూ అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ చెన్నైలోని ఎగ్మూరు కోర్టులో పిటిషన్ సమర్పించారు.

శశికళ, టీటీవీ దినకరన్, టీటీవీ భాస్కరన్ ల మీద నమోదు అయిన విదేశీ మారకద్రవ్యం కేసు విచారణ స్థానిక ఎగ్మూరు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి గతంలో శశికళకు మోక్షం కలిగింది. అయితే ఫెరా కేసులో శశికళను మళ్లీ విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు కోర్టులో మనవి చేశారు.

Vk Sasikala seeks questions in advance in FERA case

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను వీడియో కాన్పరెన్సింగ్ ద్వారా విచారించి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకోవడానికి ఎగ్మూరు కోర్టు అనుమతి ఇచ్చింది. ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి కేసు విచారణ చేశారు.

ఆ సమయంలో శశికళ తరపు న్యాయవాది కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు శశికళకు ముందుగానే ఇవ్వాలని కోర్టులో మనవి చేశారు. అయితే శశికళకు ముందుగానే ప్రశ్నలు ఇవ్వడం కుదరదని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో మనవి చేశారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేశారు.

English summary
Jailed AIADMK (Amma) leader Sasikala Natarajan has petitioned a court to send her the list of questions to be asked from her when the court takes up framing of charges against her in a two-decade-old FERA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X