వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్: అంతు చూడటానికి యుద్ధానికి దిగుతాం: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉగ్రవాదుల అంతు చూడటానికి అవసరమైతే భారత్ యుద్ధానికి దిగడం తధ్యమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లో దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ పాక్ ను గట్టిగా హెచ్చరించారు.

కొన్ని సందర్బాల్లో పరిస్థితుల తీవ్రత దృష్ట్యా యుద్ధం తప్పనిసరి అవుతుందని నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదం మానవత్వానికి శత్రువని, దానిని అంతం చేయాలని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలను కచ్చితంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు.

పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత నరేంద్ర మోడీ మొదటి సారి ఉగ్రవాదంపై బహిరంగంగా మాట్టాడారు. సరిస్థితుల తీవ్రత దృష్ట్యా యుద్ధం అనివార్యం అవుతుందని అన్నారు.

పాక్ కు పోయేకాలం వచ్చింది: అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది

భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే రెచ్చగొడితే యుద్ధానికి సిద్దం అవుతుందని అన్నారు. ఇదే సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ రామాయణం, మహాభారతాలను ఉదాహరించారు.

దసరా ఉత్సవాల్లో పాల్గొన్న వారిని ఉత్తేజపరిచేందుకు జై శ్రీరాం అంటూ నినాదాలు చేసిన నరేంద్ర మోడీ తరువాత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చారిత్రక ఇష్ బాగ్ రాంలీలా ఉత్సవాల్లో పాల్గొనడం చాల సంతోషంగా ఉందని చెప్పారు.

War becomes unavoidable, says Prime Minister Narendra ModiWar becomes unavoidable, says Prime Minister Narendra Modi

రాముడు, కృష్ణుడు కూడా యుద్ధాలు చేశారని గుర్తు చేశారు. అయితే భారత్ చాల కాలం నుంచి యుద్ధాలు పక్కన పెట్టి శాంతిని కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని వదలమని అన్నారు.

ఉగ్రవాదాన్ని ఏరిపారేయాలని చెప్పారు. ఇదే సందర్బంలో పాక్ తో పాటు చైనాను కూడా మోడీ పరోక్షంగా హెచ్చరించారు. ఉగ్రవాదం మా దేశంలో లేదని చెప్పే కొన్ని దేశాలు ఉన్నాయని అన్నారు.

ఉగ్రవాదాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చెప్పి చాల తప్పు చేస్తున్నారని చెప్పారు. అయితే మాదేశంలో ఉగ్రవాద సమస్య ఉందా ? లేదా ? అని ప్రపంచానికే తెలుసని, కొన్ని దేశాలు మాత్రం స్వార్థంతో మన దేశం మీద ఆరోపణలు చేస్తున్నాయని మోడీ అన్నారు.

1992-93 వరకు అమెరికాతో సహ చాల దేశాలు భారతదేశంలో ఉగ్రవాద సమస్యలేదని, అది శాంతి భద్రతల సమస్య అని భావించారని అన్నారు. అయితే 26/11 దాడుల తరువాత అమెరికాతో సహ చాల దేశాలు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నాయని చెప్పారు.

రామాయణంలో జటాయువు మొదటి టార్గెట్ టెర్రరిస్టు అని మోడీ గుర్తు చేశారు. మీ ఇళ్లలో ఉన్న సీతలను కాపాడుకోవాలని సూచించారు. బేటీ బచావో బేటీ పఢావో అంటు నరేంద్ర మోడీ నినాదాలు చేశారు.

ప్రజలందరూ ఉగ్రవాదంపై పోరాటం చెయ్యడానికి సిద్దం కావాలని, దేశమంతా ఒక్కటిగా నిలిస్తే ఈ ఉగ్రవాదం బాధ మనకు తప్పుతుందని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ దసరా మనకు చాల స్పెషల్ అంటూ నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

English summary
Much of Narendra Modi’s speech, which he began as well as ended with loud cries of “Jai Shri Ram”, was devoted to the need for the world to unite to fight the menace of terrorism.
Read in English: Pics: PM Modi in Lucknow
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X