బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీభత్సం: ట్యాంకర్ దూసుకు వెళ్లి ఇద్దరి దుర్మరణం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వేగంగా వెళ్తున్న ట్యాంకర్ ట్రాఫిక్ సిగ్నల్ లో అదుపు తప్పి దూసుకు వెళ్లడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన బెంగళూరులోని హెబ్బాళ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరధిలో జరిగింది. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో దేవనహళ్లి నివాసి అర్పితా (20), చిక్కబళ్లాపురం జిల్లా గోల్లహళ్లి నివాసి ఆనంద్ (23) అనే ఇద్దరు మరణించారు. ఇదే ప్రమాదంలో సుమంత్ రెడ్డి, సింథి కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న అక్షత, కుసమశ్రీ,లకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు.

అర్పిత బెంగళూరులోని ప్రెసిడెన్సీ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నది. గురువారం కాలేజ్ వదిలిన తరువాత విద్యార్ధులు అందరు బెంగళూరు-బళ్లారి రోడ్డులోని హెబ్బాళ సమీపంలోని కెంపాపుర జంక్షన్ దగ్గరకు వెళ్లారు. కెంపాపుర పరిసర ప్రాంతాలలో కాలేజ్ లు చాల ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఉదయం, సాయంత్రం విద్యార్థులు ఎక్కవ మంది గుమికూడుతారు. అదే సమయంలో ఆనంద్, సుమంత్ రెడ్డి బైక్ మీద అటు వెళ్లారు. రెడ్ సిగ్నల్ పడటంతో బైక్ నిలిపారు

. సిగ్నల్ పడిన విషయం గమనించిన అర్పితా, అక్షత, కుసమశ్రీతో పాటు సుమారు 20 మంది రోడ్డు దదాటడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో యలహంక నుండి ఫ్లై ఓవర్ మీదుగా వేగంగా వచ్చిన ట్యాంకర్ సిగ్నల్ లోకి దూసుకు వెళ్లింది. నిలిపి ఉన్న బైక్ ను డీకొడనంతో ఆనంద్ కిందపడిపోయాడు. అతని మీద నుండి పాదచారుల మీదకు ట్యాంకర్ దూసుకు వెళ్లింది. అర్పితా కిందపడటంతో ట్యాంకర్ చక్రాలు ఆమె మీద దూసుకుపోయాయి. ప్రాణభయంతో రోడ్డుదాటుతున్న వారు పరుగులు తీశారు. తీవ్రాగాయాలైన ఆనంద్, అర్పితా ఇద్దరు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. సుమంత్ రెడ్డి కుడి కాలు పూర్తిగా తెగిపోయింది. చట్టు పక్కల వ్యాపారం చేస్తున్నవారు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు.

Water tanker kills two in Bangalore in a horrifying road accident

ప్రమాదం జరిగిన తరువాత ట్యాంకర్ డ్రైవర్ యతీష్ బాబు అక్కడి నుండి పారిపోయి పోలీసులకు లోంగిపోయాడు. ఇతను రాజనకుంటే నుండి మారతహళ్ళికి డ్రైనేజ్ నీరు తరలిస్తున్నాడు. ఫ్లైఓవర్ మీద వేగంగా వస్తున్న సమయంలో సిగ్నల్ దగ్గర బ్రేక్ వేశానని అయితే వాహనం నిలవలేదని డ్రైవర్ పోలీసులకు చెప్పాడు. వాహనం వేగంగా నడిపానని డ్రైవర్ యతీస్ బాబు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

ఈప్రమాదంలో ప్రాణాలు కొల్పోయిన అర్పితా చాల రోజుల నుండి కాలేజ్ కు వెళ్లడానికి స్కూటర్ తీసివ్వాలని ఇంటిలో చెబుతున్నది. ఈమె తండ్రి జనార్ధన్ దేవనహళ్లి మాజీ కౌన్సిలర్. బెంగళూరు- బళ్లారి రోడ్డులో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, నిత్యం వాహన సంచారం ఎక్కవగా ఉండటం వలన కుటుంబ సభ్యులు స్కూటర్ తీసివ్వడానికి నిరాకరించారు. అయితే అదే రోడ్డులో అర్పితా ఈ విదంగా ప్రాణాలు విడిచింది. ఆనంద్, సుమంత్ రెడ్డి దేవనహళ్ళిలో వాచ్ సెంటర్ ప్రారంభించటానికి అన్నిఎర్పాట్లు చేసుకున్నారు. ఆనంద్ ఈ విదంగా ప్రాణాలు వదిలాడు.

English summary
A speeding water tanker rammed into a group of people who were crossing the road near Esteem Mall at Kempapura Junction in Hebbal on Thursday noon. Before the vehicle came to a halt, it had hit a bike, killed two people on the spot and seriously injured three others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X