వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండంత చేయొద్దు: వర్మ, అమీర్‌ఖాన్‌ని కొట్టేందుకు వెబ్‌సైట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: సెలబ్రిటీలు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు అసహనంపై మాట్లాడే ముందు నిగ్రహం ప్రదర్శించాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు చురకలంటించారు.

సమాజంపై ప్రభావం చూపగల వ్యక్తులు మత అసహనం లాంటి కీలక అంశాలపై మాట్లాడే ముందు నిగ్రహం కోల్పోవద్దన్నారు. నియంత్రణ కోల్పోతే అది వ్యక్తిత్వానికే చేటు తీసుకు వస్తుందని హెచ్చరించారు. అసహనం అనేది మానవ నైజం అన్నారు.

చిన్నచిన్న వాటికే ఆందోళన చెందడం అనవసరమని చెప్పారు. మిగతా దేశాలలోని హింసతో పోలిస్తే భారత్‌లో చాలాచాలా తక్కువగా ఉందన్నారు. కాబట్టి గోరంత దాన్ని కొండంత చేయవద్దని హితవు పలికారు. అలా చేస్తే ఏదో జరిగిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతారన్నారు.

Website created to slap Aamir Khan

అసహనం మానవ నైజమని, అది కచ్చితంగా ఉండి తీరుతుందన్నారు. పెద్దపెద్ద సంఘటనలు జరిగితే దానిని అసహనంగా పరిగణించవచ్చన్నారు. కానీ చిన్న వాటిని పెద్దగా చేయవద్దన్నారు. సెలబ్రిటీలు వేలం వెర్రితో చేస్తున్న వ్యాఖ్యలే తప్ప అసలు అసహనం అనే పదానికే సరైన అర్థం లేదని తాను భావిస్తున్నట్లు వర్మ చెప్పారు.

అమీర్ ఖాన్‌ను కొట్టేందుకు వెబ్‌సైట్

ఇటీవల అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆయన పైన చాలామంది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరైతే.. అమీర్ ఖాన్‌ను ఐఎస్ఐ ఏజెంట్ అని, తీవ్రవాది సానుభూతిపరుడు అని మండిపడ్డారు. శివసేనకు చెందిన ఓ నాయకుడు.. అమీర్ ఖాన్ చెంప పైన కొట్టే ప్రతి దెబ్బకు రూ.లక్ష ఇస్తానని ప్రకటించారు.

తాజాగా, అమీర్ ఖాన్‌ను కొట్టేందుకు ఓ వెబ్ సైట్ తెరిచారు. స్లాప్అమీర్.కామ్ (slapaamir.com)ను మియామీ యాడ్ స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు తెరిచారు. ఇందులో అమీర్ ఖాన్ పిక్చర్ ఉంటుంది. దాని పక్కనే ఓ చేతి ఉంటుంది.

<iframe width="660" height="371" src="https://www.youtube.com/embed/7mGlW5QSenk" frameborder="0" allowfullscreen></iframe>

మౌస్ ద్వారా దానిని కొట్టే విధంగా ఈ సైట్ రూపొందించారు. కొట్టే ప్రతి దెబ్బకి అమీర్ ఖాన్ ఇమేజ్ మారుతుంటుంది. స్లాప్ అమీర్ డాట్ కామ్ క్రియేటివ్ పర్పస్‌లోనే చేశామని, ఇందులో పాల్గొనే వారికి ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధాలు అంటగట్టవద్దని అభిప్రాయపడ్డారు.

English summary
A website has been launched to slap the Bollywood actor. The website -- slapaamir.com -- has been launched by a group of students of Miami Ad School.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X