వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపోలో ఆసుపత్రిలో జయలలిత : ఆదివారం రాత్రి నుండి ఏం జరిగింది

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై : ఆసుపత్రి నుండి త్వరలోనే డిశ్చార్చ్ అవుతారని వైద్యులు ప్రకటించిన కొద్దిగంటల్లోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యం విషమించింది. ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆదివారం రాత్రి నుండి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమెకు గుండెపోటు వచ్చినప్పటి నుండి ఏం జరిగిందో తెలుసుకొందాం.ఆమె కోలుకొనేందుకు వీలుగా వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.

 what happend in apollo hospital on jayalalita health

9.30 నిమిషాలు. ఆపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న జయలలితకు గుండెపోటు వచ్చిందని ఆదివారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రకటించారు.
9.40 నిమిషాలు. ఈ వార్త తెలిసిన వెంటనే జయ అభిమానులు, ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆపోలో కు వచ్చారు. ఆమెకు చికిత్సను ప్రారంభించారు.
9.50 నిమిషాలు . తమిళనాడు ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. జయ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.
9.55 నిమిషాలు. ఆపోలో ఆసుపత్రిని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకొన్నాయి. ఆసుపత్రిలోకి సాధారణ ప్రజలు వెళ్ళకుండా అడ్డుకొన్నారు.
10.00 జయలలిత ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు.

 what happend in apollo hospital on jayalalita health
10.52 నిమిషాలు. ఆపోలో ఆసుపత్రిలోనే మంత్రివర్గం సమావేశమైంది.
10.55నిమిషాలు. ఆపోలో ఛైర్మెన్ తో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా ఫోన్ లో మాట్లాడారు. జయ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.
11.00 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయలలిత కోలుకోవాలని ట్వీట్ చేశారు.
11.03 తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఆపోలో ఆసుపత్రికి చేరుకొన్నారు.
11.07 నిమిషాలకు ఎయిమ్స్ నుండి ప్రత్యేక వైద్య బృందం ఆపోలోకు చేరుకొన్నారు.
11.09 నిమిషాలకు జయలలిత గుండె సంబంధిత పరికరం సాయంతో చికిత్సను ప్రారంభించారు.
11.10 గంటలకు ఆపోలో వైద్యులు లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బీలేనే సంప్రదించాడు. ఆయన సలహాలను తీసుకొన్నారు.
11.120 నిమిషాలకు జయలలిత త్వరగా కోలుకోవాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు.
11.25 నిమిషాలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జయ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.
11.30 కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జయలలిత కోలుకోవాలని ట్వీట్ చేశారు.
12.23 నిమిషాలకు మద్రాస్,అన్నాయూనివర్శిటీల పరిధిలోని అన్ని స్కూళ్ళకు డిసెంబర్ ఐదున సెలవును ప్రకటిస్తున్నట్టు తమిళనాడు బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకటించింది.
12.29 గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసుపత్రి నుండి వెళ్ళిపోయారు.
12.32 హోంమంత్రి అత్యవసరంగా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు
1.36 నిమిషాలకు జయ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆసుపత్రిలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు.
2.59 నిమిషాలకు సెలవులను రద్దుచేస్తున్నట్టు తమిళనాడు డిజిపి ప్రకటించారు.
6.16 నిమిసాలకు అన్నాడిఎంకె కార్యకర్తలు జయ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకొనేందుకుగాను ఆపోలో ఆసుపత్రిలోకి వచ్చారు
6.45 నిమిషాలకు ఆసుపత్రి వద్ద తొక్కిసలాట జరగకుండా బ్యారికేడ్లను ఏర్పాటుచేశారు.
7.00 నిమిషాలకు తమిళనాడు నటుడు శరత్ కుమార్ ఆపోలో ఆసుపత్రికి వచ్చారు. ప్రజల ఆశీర్వాదంతో ఆమె తిరిగి వస్తారని చెప్పారు.
7.20 నిమిషాలకు జయలలిత ఇంటిచుట్టూ భారీగా భద్రత బలగాలు మోహరించారు.
7.25 నిమిషాలకు అన్నా యూనివర్శిటీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని యూనివర్శిటీ ప్రకటించింది.
8.45నిమిషాలకు చెన్నైలో ట్రాఫిక్ జామ్, ఆపోలో ఆసుపత్రికి వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఆంక్షలు
8.50 డిల్లీ నుండి మరికొంత మంది ఎయిమ్స్ వైద్యులు ఆపోలోకు వచ్చారు.
9.00 .జయలలితకు చికిత్సను ప్రారంభించిన వైద్యులు
12 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

6 గంటలకు జయలలిత ఆరోగ్యపరిస్థితిపై కీలకమైన ప్రకటన ఉంటుందని ప్రచారం

5.48 గంటలకు జయలలిత చనిపోయిందని ప్రసారసాధనాల్లో ప్రచారం

5.52నిమిషాలకు ఆపోలో ఆసుపత్రి వద్ద అన్నా డిఎంకె కార్యకర్తల విధ్వంసం

6.10 నిమిషాలకు జయలలితకు ఆపోలో వైద్యులు వైద్యం అందిస్తున్నారని, ఆమె చనిపోలేదని ,ఆపోలో ఈడీ సంగీతా రెడ్డి ప్రకటించారు.

English summary
what happend in apollo hospital on jauyalalita helath. on sunday night jaya attack chronic problem. doctors started treatment.apollo doctors talk to london doctor richard. aims team of doctors also came to chennai for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X