వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సాప్ లో కొత్త ఫీచర్లు, యూజర్లకు మెరుగైన సేవలు, కోరుకొన్నవారికే స్టేటస్ ఇలా...

వాట్సాప్ కొత్త పీచర్లను అందుబాటులోకి తెచ్చింది.కాంటాక్ట్స్ స్థానంలో కొత్త ఫీచర్లు కన్పిస్తున్నాయి. ఒక కెమెరా సింబల్, చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్త పీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:వాట్సాప్ కొత్త పీచర్లను అందుబాటులోకి తెచ్చింది.కాంటాక్ట్స్ స్థానంలో కొత్త ఫీచర్లు కన్పిస్తున్నాయి. ఒక కెమెరా సింబల్, చాట్స్, స్టేటస్, కాల్స్ అనే నాలుగు కొత్త పీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.కాంటాక్ట్స్ నేరుగా కన్పించవు.

వాట్సాప్ సమాచార సాంకేతిక విప్లవంలో అతి తక్కువ సమయంలోనే ప్రజలకు మరింత చేరువైంది. స్మార్ట్ ఫోన్ల యుగంలో వాట్సాప్ యాప్ ప్రజలకు సమాచారాన్ని అంతే వేగంగా అందించేందుకు ఉపయోగపడుతోంది.

వాట్సాప్ యాప్ ప్రారంభమైన నాటి నుండి అనేక మార్పులు చేర్పులు చేసుకొంటూ ముందుకు వెళ్లోంది.అయితే ఇతర యాప్ లు ఉన్నా వాట్సాప్ అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.

వాట్సాప్ మాత్రం తన యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకుగాను ప్రయత్నిస్తోంది.ఇందులో భాగంగానే వాట్సాప్ కొత్త పీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ఈ కొత్త ఫీచర్ల ద్వారా మరింత మెరుగైన సేవలను యూజర్లు పొందే వీలుంటుంది.

వాట్సాప్ లో కొత్త ఫీచర్లు

వాట్సాప్ లో కొత్త ఫీచర్లు

వాట్సాప్ కొత్త పీచర్లను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంటా వాట్సాప్ లో కాంటాక్ట్స్ కనిపిస్తుంటాయి.అయితే కాంటాక్ట్స్ స్థానంలో కొత్త పీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కెమెరా సింబల్ తో , ఆ తర్వాత చాట్స్, స్టేటస్ కాల్స్ అనే నాలుగు కొత్త పీచర్లను తన యూజర్లకు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్పులను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.

వాట్సాప్ కొత్త ఫీచర్లలిలా

వాట్సాప్ కొత్త ఫీచర్లలిలా

స్టేటస్ కొత్తగా హోం స్క్రీన్ మీదకు వచ్చి చేరింది.ఎవరైనా కొత్తగా స్టేటస్ మారిస్తే ఆ విషయాన్ని కూడ మన స్టేటస్ గుర్తు కింద కన్పిస్తూ ఉంటుంది. ఎవరెవరూ ఫ్రోఫైల్ పిక్చర్ ను మార్చారు, స్టేటస్ అప్ డేట్ చేశారనే వివరాలు ఉంటాయి.దానికి రిప్లై ఇచ్చేందుకు కూడ ఐదు సెకన్ల సమయం ఉంటుంది. ఇంతకుముందు స్టేటస్ అంటే కేవలం ఫ్రోఫైల్ పిక్చర్ మార్చడం, చిన్న వాక్యం ఏమైనా పెట్టడం మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు చిన్న పాటీ వీడియో లేదా ఫోటోను కూడ స్టేటస్ గా పెట్టుకోవచ్చు.

వాట్సాప్ పుట్టిన రోజునే కొత్త పీచర్లు అందుబాటులోకి

వాట్సాప్ పుట్టిన రోజునే కొత్త పీచర్లు అందుబాటులోకి

వాట్సాప్ పుట్టినరోజు ఫిబ్రవరి 24వ, తేది. కొత్త ఫీచర్లను వాట్సాప్ పుట్టిన రోజును పురస్కరించుకొని అందుబాటులోకి తెస్తున్నట్టుగా వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు సిఈఓ జాన్ కౌమ్ తెలిపారు. చాట్ ల మాదిరిగానే ఈ స్టేటస్ ను అప్ డేట్ కూడ ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కావడంతో వేరే ఎవరైనా మధ్యలో చూస్తారన్న భయం కూడ అవసరం లేదు. కేవలం మన కాంటాక్టులలో ఉన్నవాళ్లకు మాత్రమే అవి కన్పిస్తాయి. అంతేకాదు మనం పెట్టిన స్టేటస్ మేసేజ్ లు 24 గంటల తర్వాత ఆటోమెటిక్ గా మాయమైపోతాయి.యూజర్లు ఎక్కువగా వాట్సాప్ ను వాడేలా చేసేందుకే ఈ స్టేటస్ పీచర్ ఉపయోగపడుతోంది.

కొత్త పీచర్లు అందరికీ అందుబాటులోకి

కొత్త పీచర్లు అందరికీ అందుబాటులోకి

కొత్తగా విడుదల చేసిన ఫీచర్లను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా వాట్సాప్ చర్యలు తీసుకొంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ యూజర్లందరూ కూడ వినియోగించుకోవచ్చును. రోజంతా ఆ విషయాన్ని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియవచ్చని వాట్సాప్ ప్రకటించింది.కొత్త పీచర్ల ద్వారా యూజర్లు కోరుకొన్నట్టుగా మార్చుకొనే వెసులుబాటును కల్పించింది.

కోరుకొనే వారే స్టేటస్ ను చూసే వెసులుబాటు

కోరుకొనే వారే స్టేటస్ ను చూసే వెసులుబాటు

స్టేటస్ ను మార్చినప్పుడు దాన్ని ఎవరెవరు చూడవచ్చో, ఎవరెవరు చూడకూడదనే విషయాన్ని మనం సెట్ చేసుకోవచ్చు.ఇందుకోసం స్టేటస్ ప్రైవసీ అనేది ఒకటి ఉంది. అందులో మై కాంటాక్ట్స్ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ ఒన్లీ షేర్ విత్ అనే మూడు ఆఫ్షన్లు కన్పిస్తాయి.మన కాంటాక్టులలో ఉన్నవాళ్ళంతా చూడవచ్చంటే ఒకటి, ఒకరిద్దరూ తప్ప అనుకొంటే రెండోది, కేవలం కొంతమంది అనుకొంటే మూడోది మనం సెలెక్ట్ చేసుకోవాలి. డీ ఫాల్ట్ గా మాత్రం మొదటిదే ఉంటుంది.

కాంటాక్టులు ఎక్కడ ఉంటాయంటే

కాంటాక్టులు ఎక్కడ ఉంటాయంటే

ఇప్పుడు కొత్తగా అప్ డేట్ అయిన వాట్సాప్ లో కాంటాక్టులు నేరుగా కన్పించవు. మరి వాటిని ఎక్కడ వెతికి పట్టుకోవాలంటే మనం చాట్స్ అనే ట్యాబ్ లో ఉన్నప్పుడు పైన సెర్చ్ బటన్ పక్కనే ఉండే సింబల్ ను టచ్ చేస్తే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా మొత్తం కాంటాక్టులు కన్పిస్తాయి. ఇంతకుముందు కాంటాక్టులు చూసినప్పుడే అందులో వాళ్ళ స్టేటస్ కూడ కన్పించేది. ఇప్పుడు అలా కాకుండా కేవలం వాళ్ల ఫ్రోఫైల్ పిక్చర్ మనం సేవ్ చేసుకొన్న పేరు మాత్రమే వస్తాయి.

English summary
The new WhatsApp Status feature allows users to share pictures, videos, and GIFs with their contacts, which will disappear after 24 hours. Sounds familiar? It should. Unlike the other two features though, the new WhatsApp Status will incorporate the same end-to-end encryption enjoyed by the app's traditional messages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X