వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీపై వ్యతిరేకత: modifail.com పేరిట వెబ్‌సైట్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఎన్నారైలు నీరాజనాలు పలికారు, కానీ ఇప్పుడు అదే మోడీ మళ్లీ అమెరికాలో పర్యటనకు సిద్ధమైతే ఆయనకు వ్యతిరేకంగా అక్కడ ప్రచారం ప్రారంభించారు.

అమెరికా పర్యనటలో భాగంగా డిజిటల్ ఇండియా ప్రచారం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో సిలికాన్ వ్యాలీని సందర్శించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ఎన్నారైలు మోడీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలకు సిద్ధమయ్యారు.

ముఖ్యంగా సిలికాన్ వ్యాలీ సందర్శనకు వ్యతిరేకంగా ట్విట్టర్, వెబ్‌సైట్ల ద్వారా ప్రచారోద్యమాన్ని ప్రారంభించారు. అంతేకాదు 'మోడీ ఫెయిల్ డాట్ కామ్' అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. సాన్ జోస్‌లోని శాప్ సెంటర్‌లో సెప్టెంబర్ 27వ తేదీన 18,500 మందిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.

Why activists have started the modifail.com website to protest the PM's visit to Silicon Valley

ఎందుకీ నిరసన ర్యాలీలు:

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌లో దళితులు, మైనారిటీలు, మహిళలకు వ్యతిరేకంగా హింస పెరిగిపోయిందని వారు ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారు. పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందని, అకడమిక్, సాంస్కృతిక సంస్థల్లో మత ఛాందస రాజకీయాలను చొప్పిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.

దీంతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయల ప్రయోజనాల కోసం ఇంత వరకు మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సిలికాన్ వ్యాలీకి వస్తున్న మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందని సిలికాన్ వ్యాలీ సభ్యులు పిలుపునిచ్చారు.

English summary
On Sunday, less than a week before Indian Prime Minister Narendra Modi was due to visit Silicon Valley to promote his Digital India initiative, a stream of messages started to flood Twitter with the hashtag #Modifaildotcom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X