బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ వద్దకు విజిటర్స్ తగ్గటం వెనుక..? సీఎంకు 'చిన్నమ్మ' చిక్కు

అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ వద్దకు విజిటర్స్ క్రమంగా తగ్గుతున్నారు. గత వారం తమిళనాడుకు చెందిన ఎంపీని, మంత్రిని జైలు అధికారులు వెనక్కి తిప్పి పంపించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: అక్రమాస్తుల కేసులో అరెస్టై బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళ వద్దకు విజిటర్స్ క్రమంగా తగ్గుతున్నారు. గత వారం తమిళనాడుకు చెందిన ఎంపీని, మంత్రిని జైలు అధికారులు వెనక్కి తిప్పి పంపించారు.

అడ్డంగా దొరికాడు.. శశికళ ఫిర్యాదు: 'దినకరన్ రాజకీయ జీవితం ఖతం'అడ్డంగా దొరికాడు.. శశికళ ఫిర్యాదు: 'దినకరన్ రాజకీయ జీవితం ఖతం'

శశికళను కలిసేందుకు ఎక్కువ మంది వస్తుండటంతో జైలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ మందిని కలవనీయడం లేదు. ముఖ్య నేతలను కూడా వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. నిబంధనల మేరకు శశికళను కలిసేందుకు వచ్చే వారిని అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు.

కర్నాటక జైలు రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

కర్నాటక జైలు రూల్స్ ఏం చెబుతున్నాయంటే..

చాప్టర్ 31, కర్నాటక జైలు నిబంధనల ప్రకారం నేరస్తుడిని కలుసుకునేందుకు ఓ విజిటర్ పదిహేను రోజులకు ఒకసారి రావొచ్చు. ఇది కొత్తగా జైలుకు వచ్చిన వారికి కాస్త ఇబ్బంది. కొత్తగా జైలుకు వచ్చిన ఖైదీలకు ప్రారంభంలో జైలు అధికారులు తమ విచక్షణ మేరకు కొంత వెసులుబాటు కల్పిస్తారు.

క్రమంగా తగ్గింపు

క్రమంగా తగ్గింపు

ఆ తర్వత క్రమంగా నేరస్తుడిని కలుసుకునేందుకు జైలు అధికారులు క్రమంగా విజిటర్స్‌ను తగ్గిస్తుంటారు. శశికళ వచ్చి నెలలు అవుతోంది. ఆమెకు కొత్తలో కొంత వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత ఆమె సర్దుకున్నారని భావించిన తర్వాత విజిటర్స్‌ను తగ్గిస్తూ వెళ్తున్నారు.

పళనిస్వామి, మంత్రులపై వేటు వేయాలని.. పార్టీ కార్యకర్తనే..

పళనిస్వామి, మంత్రులపై వేటు వేయాలని.. పార్టీ కార్యకర్తనే..

అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా తేలి బెంగుళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళతో మిలాఖత్‌ నిర్వహించిన నలుగురు మంత్రులతో పాటు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక పిటీషన్‌ దాఖలైంది.


ఈ పిటీషన్‌ను విరుదునగర్‌ జిల్లా శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త అన్బళగన్‌ దాఖలు చేయడం గమనార్హం. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, పూర్తి విచారణను ఈ నెల 28వ తేదీన చేపట్టనున్నట్టు తెలిపింది.

శశికళను కలిసి..

శశికళను కలిసి..

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమితులయ్యారు. ఆ తర్వాత జయ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లను దోషులుగా ప్రకటించింది. దీంతో వారంతా బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మంత్రివర్గంలో కేబినెట్‌ మంత్రులుగా పని చేస్తున్న మంత్రులు పలువురు.. శశికళ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి ఎడప్పాడి సర్కారు పని చేస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులుగా ఉన్న కేఏ సెంగోట్టయ్యన్‌, సెల్లూరు కె రాజు, దిండిగల్‌ శ్రీనివాసన్‌, కామరాజ్‌లు బంగళూరు వెళ్ళి... శశికళను కలిశారు.

రాజ్యాంగ వ్యతిరేకం

రాజ్యాంగ వ్యతిరేకం

తమ మిలాఖత్‌ సమయంలో ప్రభుత్వ పనితీరుపై చర్చించినట్టు వారు వెల్లడించారు. దీన్ని ముఖ్యమంత్రి లేదా ఏ మంత్రీ ఖండించలేదు. ఇలా వ్యవహరించడం భారత రాజ్యాంగ శాసనం 188కి వ్యతిరేకం. ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో చేసిన రహస్య ప్రమాణ స్వీకారాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. శశికళ దేశ అత్యున్నత న్యాయస్థానం నిర్థారించిన ఒక నేరస్థురాలు.

అందుకే.. పిటిషన్‌దారుకు కోర్టు ప్రశ్నలు

అందుకే.. పిటిషన్‌దారుకు కోర్టు ప్రశ్నలు

జైలు జీవితం గడుపుతున్న శశికతో సమావేశమై పాలనాపరమైన విషయాలు చర్చించినందుకు గాను నలుగురు మంత్రులతో పాటు, ముఖ్యమంత్రిని అనర్హులుగా ప్రకటించాలని అన్నాడీఎంకే కార్యకర్త అన్బళగన్‌ దాఖలు చేసిన పిటీషన్‌లో కోరారు.

దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు పిటీషన్‌దారునికి కొన్ని ప్రశ్నలు సంధించింది. గవర్నర్‌ను కోర్టు ఆదేశించే అధికారం ఉందా? ఇదే విషయంపై వచ్చిన ఫిర్యాదుపై గతంలో స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఈ నెల 28వ తేదీలోపు మరో పిటీషన్‌ దాఖలు చేయాలని మదురై బెంచ్‌ ఆదేశించింది.

English summary
The numbers of visitors for Sasikala Natarajan in the Bengaluru jail has gone down considerably. Jail authorities have started to cut down the number of visitors and in the past week even sent back an MP and a minister from Tamil Nadu. The Director General of Prisons, Sathyanarayana Rao said that the jail authorities had not flouted any norms in allowing the stipulated number of visitors to meet Sasikala in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X