వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిలీప్‌లో చీకటి కోణాలున్నాయా?: నటిపై ఎందుకంత కక్ష, మరో నటుడికి చెక్

రెండు రోజుల కస్టడీలో భాగంగా.. పోలీసులు దిలీప్ నుంచి కీలక వివరాలు రాబట్టాలని చూస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

కొచ్చి: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మలయాళ నటి లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ పాపులర్ హీరో దిలీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. నిజాలన్ని ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుండటంతో.. వేధింపుల పర్వం వెనుక అసలు హస్తం ఆయనదే అన్న విషయం చూచాయగా ఇప్పటికే స్పష్టమైపోయింది.

సునీ లేఖ, సీక్రెట్ నెంబర్లతో అడ్డంగా బుక్కయిన హీరో దిలీప్, లేఖ పాఠం ఇదీ...

అయితే సదరు హీరోయిన్‌పై దిలీప్ అంతలా ఎందుకు కక్ష పెంచుకున్నాడు? అన్నది ప్రస్తుతం అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. సినిమా విభేదాలా? లేక వ్యక్తిగత కారణాలా? అన్న సంగతి తేలాల్సి ఉంది. పోలీసులు దిలీప్ ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో వీటికి సమాధానం దొరికే అవకాశం కనిపిస్తోంది.

సంచలన 'లేఖ', ఇవి అనుమానాలు:

సంచలన 'లేఖ', ఇవి అనుమానాలు:

నటిపై లైంగిక దాడి కేసులో పల్సర్ సునీల్ కీలక నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న అతను హీరో దిలీప్ కు రాసిన లేఖ బహిర్గతమైంది. లేఖలో "సౌండ్‌ థోమా నుంచి జార్జేట్టన్స్‌ పూరమ్‌ (దిలీప్‌ సినిమాలు )దాకా జరిగిన సంగతులేమీ నేను ఎవరికీ చెప్పలేదు" అంటూ సునీల్ పేర్కొనడం దిలీప్ లో మరో కోణమేమైనా ఉందా? అనుమానాలకు తావిస్తోంది.

మరోవైపు దిలీప్ మాత్రం సునీల్ ఎవరో తనకు తెలియదని బుకాయిస్తూనే ఉన్నాడు. అయితే సునీల్ తో దిగిన సెల్ఫీ ఆధారంగా దిలీప్ కు అతనితో పరిచయం ఉందని పోలీసులు రూఢీ చేశారు.

కుట్రలో ఇంకెవరికైనా ప్రమేయం?:

కుట్రలో ఇంకెవరికైనా ప్రమేయం?:

రెండు రోజుల కస్టడీలో భాగంగా.. పోలీసులు దిలీప్ నుంచి కీలక వివరాలు రాబట్టాలని చూస్తున్నారు. ఒక పాపులర్ హీరోకు మరో నటిపై లైంగిక దాడి చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అన్న దానిపై ప్రధానంగా వారు ఫోకస్ చేయనున్నారు. కుట్రలో మరెవరి హస్తమేమైనా ఉందా? అన్న దానిపై కూడా విచారణ కొనసాగనుంది.

ముఖ్యంగా త్రిశూర్ లోని పలు చోట్ల దిలీప్ నటిపై అఘాయిత్యానికి ప్లాన్ వేశాడని తెలుస్తుండటంతో... ఆయా ప్రాంతాలకు అతన్ని తీసుకెళ్లి విచారించే అవకాశం ఉంది.

ముకేశ్‌కు లింకు ఉందా?

ముకేశ్‌కు లింకు ఉందా?

కేసులో కీలక నిందితుడిగా ఉన్న పల్సర్ సునీల్ గతంలో ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముకేశ్ వద్ద కూడా డ్రైవర్ గా పనిచేసినట్లు పోలీసులు గుర్తించడం గమనార్హం. నటిపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలోను ముకేశ్ వద్దే సునీల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దిలీప్ నటించిన సౌండ్ థోమా షూటింగ్ కొనసాగుతున్న సమయంలో పల్సర్ సునీల్ ముకేశ్ వద్దే పనిచేస్తున్నాడు.

'అమ్మ షో'కి సునీల్ కూడా వచ్చాడు:

'అమ్మ షో'కి సునీల్ కూడా వచ్చాడు:

2013లో ఎర్నాకుళంలో జరిగిన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ సంఘం(అమ్మ) షోలోను ముకేశ్ డ్రైవర్‌గా సునీల్ హాజరైనట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో ముకేశ్‌ను కూడా నటి లైంగిక వేధింపుల కేసుపై ప్రశ్నించనున్నారు. కేసులో కీలక సూత్రధారిగా ఉన్న దిలీప్ సోదరుడు అనూప్ ను సైతం పోలీసులు మరోసారి ప్రశ్నించనున్నారు. దిలీప్ కస్టడీ నేపథ్యంలో.. అతను వెల్లడించే విషయాలు కేసును ఏ మలుపు తిప్పుతాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

English summary
The Kerala Police on Tuesday taken Hero Dileep into two days custody to enquire over actress molestation case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X