వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మాజీ! మీరు గ్రేట్, మా ప్రధాని ఐతే బాగుండు, ఐనా మాకు అర్హత లేదు: పాక్ మహిళ ఉద్వేగం

కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ సాయానికి పాకిస్తాన్ మహిళ ఫిదా అయ్యారు. ఇటీవల ఓ పాక్‌ మహిళకి సుష్మా సకాలంలో సాయం చేసి ఆదుకున్నారు.

|
Google Oneindia TeluguNews

కరాచీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ సాయానికి పాకిస్తాన్ మహిళ ఫిదా అయ్యారు. ఇటీవల ఓ పాక్‌ మహిళకి సుష్మా సకాలంలో సాయం చేసి ఆదుకున్నారు. దాంతో ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనై సుష్మా స్వరాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది.

అక్కడ సుష్మాను ఆశ్రయించిన పాక్ మహిళ

అక్కడ సుష్మాను ఆశ్రయించిన పాక్ మహిళ

హిజాబ్‌ అసీఫ్‌ అనే మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. వెంటనే ఆమె భారత్‌లో చికిత్స చేయించుకోవాల్సి ఉంది. ఇందుకోసం హిజాబ్‌ మెడికల్‌ వీసా కోసం ఇస్లామాబాద్‌లోని డిప్యూటీ హైకమిషనర్‌ను ఆశ్రయించింది. కానీ ఇందుకు కమిషనర్‌ ఒప్పుకోలేదు. దాంతో హిజాబ్‌ సుష్మాను ఆశ్రయించింది.

నాకు సాయం చేయాలని

నాకు సాయం చేయాలని

తనకు కాలేయ సమస్య ఉందని, భారత్‌లో చికిత్స చేయించుకోవాలని, మెడికల్‌ వీసా కావాలని అడిగితే అది మీరే చూసుకోవాలని అంటున్నారని, తనకు సాయం చేయండని విజ్ఞప్తి చేశారు. దానికి సుష్మా సానుకూలంగా స్పందించారు.

ట్విట్టర్లో ఆదేశం

ట్విట్టర్లో ఆదేశం

మెడికల్‌ వీసా వచ్చేలా డిప్యూటీ హైకమిషనర్‌ను ట్విటర్‌లో ఆదేశించింది. వెంటనే స్పందించి తనకు సాయం చేసిన సుష్మాపై హిజాబ్‌ ప్రశంసల జల్లులు కురిపించింది పాక్ మహిళ.

మీరు మా ప్రధాని ఐతే బాగుండు, కానీ పాక్‌కు అర్హత లేదు

మీరు మా ప్రధాని ఐతే బాగుండు, కానీ పాక్‌కు అర్హత లేదు

'సుష్మాజీ.. ఏమని పిలవను మిమ్మల్ని? సూపర్‌విమెన్‌ అనాలా లేక దేవత అని సంబోధించాలా? మీ మంచితనాన్ని వివరించడానికి మాటలు రావడంలేదు. లవ్యూ మేడమ్‌. కన్నీళ్లతో మిమ్మల్ని పొగడటం ఆపలేను. నా గుండె మీకోసమే కొట్టుకుంటోంది.మీరు మా ప్రధాని అయివుంటే ఎంత బాగుండో. అయినా మీలాంటి ప్రధానిని పొందే అర్హత పాక్‌కు లేదు' అని ట్వీట్‌ చేసింది.

English summary
External affairs minister Sushma Swaraj on Thursday directed the Indian High Commission in Islamabad to issue a visa to a Pakistani national for medical treatment in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X