బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు లాయర్ కాల్చివేత: జీపీఎస్ ట్రాకింగ్‌తో భార్యను వెంటాడి..

కారులో అధునాత జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ను ఉపయోగించి భార్యను వెంటాడాడు. సరిగ్గా ఆమె తన ప్రియుడికి దగ్గరగా ఉన్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇలా బెంగళూరు న్యాయవాది హత్య కేసులో ఆసక్తికర కోణాలు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కారులో అధునాత జీపీఎస్ ట్రాకింగ్ డివైజ్‌ను ఉపయోగించి భార్యను వెంటాడాడు. సరిగ్గా ఆమె తన ప్రియుడికి దగ్గరగా ఉన్న సమయంలో తుపాకీతో కాల్పులు జరిపాడు. ఇలా బెంగళూరు న్యాయవాది హత్య కేసులో ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి.

అఫైర్?: న్యాయవాది కాల్చివేత, ఆస్పత్రిలో చేర్చి ఆమె ఆత్మహత్యఅఫైర్?: న్యాయవాది కాల్చివేత, ఆస్పత్రిలో చేర్చి ఆమె ఆత్మహత్య

బెంగళూరులోని పీన్యా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ న్యాయవాది హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడిని అమిత్ కేశవ్ మూర్తిగా గుర్తించారు. ఆ తర్వాత గదిలో విగతజీవిగా కనిపించిన శృతి ఆ సమయంలో అమిత్ కేశవ్ మూర్తితో ఉంది.

ఇదీ జరిగింది..

ఇదీ జరిగింది..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ బెంగళూరుకు చెందిన శృతి గౌడ (32) రైల్వే గొల్లహళ్లిలో పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త రాజేష్ గౌడ (33). ఇద్దరు పిల్లలు ఉన్నారు. శృతి మామ గోపాలకృష్ణ.

శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి శృతి కారులో బయలుదేరింది. హేసరఘట్ట ప్రాంతంలో అమిత్ కేశవ్ మూర్తి అనే వ్యక్తిని కలిసింది. వివాహితుడైన అమిత్ న్యాయవాదిగా పని చేస్తున్నారు. చిన్నపాటి పొలిటికల్ లీడర్. ఇటీవలే జేడీయూ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

శృతిపై అనుమానంతో..

శృతిపై అనుమానంతో..

శృతి మీద అనుమానంతో ఆమె కారును జీపీఎస్ ట్రాకింగ్ పరికరం ద్వారా భర్త రాజేష్ గౌడ, మామ గోపాలకృష్ణలు వెంటాడారు. కారులో శృతి, అమిత్ కేశవ్ మూర్తిలు పక్క పక్కనే కూర్చున్నారు. అప్పుడు కాల్పులు జరిపారు.

ఇరువురి మృతి

ఇరువురి మృతి

రక్తపు మడుగులో పడిన అమిత్ కేశవ్ మూర్తిని శృతి సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించింది. అప్పటికే శృతి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో శృతి తన పుట్టింటి వారికి ఫోన్ చేసి, లాడ్జిలో ఉన్నట్లు చెప్పింది. వారు వెళ్లేసరికి దుప్పటితో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

రెండే వేర్వేరు కేసులు

రెండే వేర్వేరు కేసులు

ఈ ఘటనకు సంబంధించి రెండే వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమిత్ కేశవ్ మూర్తి హత్య, శృతి ఆత్మహత్య కేసులు నమోదు చేశారు. కాగా అమిత్‌ను శృతి భర్త రాజేష్ గౌడ కాల్చాడా లేక మామ గోపాల కృష్ణ కాల్చాడా తెలియాల్సి ఉందంటున్నారు. అమిత్‌తో శృతి సంబంధం, ఆత్మహత్యకు దారి తీసిన అంశాలు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై ఇరు కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో ఇరు కుటుంబాలు ఆనందగా గడిపాయని, చంపుకునేంత గొడవలు ఏం వచ్చాయోనని అమిత్ కేశవ్ మూర్తి తల్లి అంటున్నారు.

English summary
Woman ends life after her friend is shot dead
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X