బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కదులుతున్న ఆటోలో మహిళా టెక్కీపై దాడి, దోపిడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman techie assaulted, robbed in moving auto
బెంగళూరు: మహిళా టెక్కీపై కర్ణాటక రాజధాని బెంగళూరులో దాడి జరిగింది. దుండగులు ఆమెపై దాడి చేసి దోచుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మధుమతి మంగళవారం సాయంత్రం 6 గంటలకు జెపినగర్ రాగి గుడ్డలో ఆటో ఎక్కింది. అయితే, మూడున్నర కిలోమీటర్ల దూరంలో గల విజయ బ్యాంక్ కాలనీ మైకో లేఅవుట్ ఇంటికి వెళ్లడం ఆమెకు కలగానే తోచింది.

ఆటోలోకి గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేసి ఆమెపై దాడి, ఆమె వస్తువులను దోచుకుని వెళ్లాడు. ఆటో డ్రైవర్ కూడా ఆ సంఘటనలో పాలు పంచుకున్నాడు. సహాయం కోసం ట్రాఫిక్‌లో ఆమె కేకలు వేసినా పట్టించుకున్నవారు లేరు. చివరకు ఆమె హులిమావుకు 3 కిలోమీటర్ల దూరంలో సాయంత్రం 7 గంటలకు కిందికి తోసేసి వెళ్లిపోయారు.

మధుమతి మైకో లేఅవుట్ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. మధుమతికి చెందిన 70 గ్రాముల ఆభరణాలను దోచుకుని వెళ్లారు. వాటిలో బంగారు గొలుసు, మంగళసూత్రం, బ్రాస్‌లెట్, చేతి ఉంగరాలు, ఐపోడా, నోకియా మొబైల్, హ్యాండ్ బ్యాగ్ ఉన్నాయి.

ఆ సంఘటన బిలేకహళ్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనతో ఆమె తీవ్ర భయాందోళనలకు గురైంది. ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కూడా గుర్తించలేకపోయింది. జెపి నగర్‌లో ఆమె ఆఫీస్ వద్ద ఈ భయందోళనలకు గురి చేసే సంఘటన ప్రారంభమైంది. ఆటో నడుస్తుండగానే ఓ వ్యక్తి ఎక్కేసి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. వారిద్దరు మాట్లాడుకోవడం ప్రారంభించారు.

తన ఇంటికి సమీపంలోకి రాగానే ఎడమ పక్కకు మలుపుకోవాలని చెప్పింది. అయితే, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి ప్యాసెంజర్ సీట్లోకి వచ్చాడు. ఆమె పక్కన కూర్చుని పెద్దగా అరవడం ప్రారంభించాడు. ఆమెను కొట్టాడు, బెదిరించాడు. ఆమె వస్తువులన్నీ లాక్కున్నాడు.

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న సిసిటివి కెమెరా సరిగా పనిచేసి ఉంటే ఆటోను గుర్తించగలమని పోలీసులు అంటున్నారు. అయితే, ఆ సిసిటివీ కెమెరా పనిచేయడం లేదని చెబుతున్నారు. అయితే, మిగతా సిసిటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయని పోలీసులు అన్నారు.

English summary
It had been a long day. Madhumati, a software engineer, was tired when she boarded an auto at Ragi Gudda in JP Nagar at 6pm Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X