వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తను పొడిచి చంపిన లేడి డాక్టర్

By Pratap
|
Google Oneindia TeluguNews

నాగ్ పూర్: కుటుంబ సమస్యల కారణంగా సహనం కొల్పోయిన భార్య ఆవేశంలో కత్తితో భర్త మీద దాడి చేసి చంపేసిన సంఘటన నాగ్ పూర్ జరిగింది. రవికాంత్ మధుకర్ (42) అనే ఆయన అతని భార్య చేతిలో హత్యకు గురైనాడు.

నాగ్ పూర్ లో రవికాంత్ మధుకర్ పాథాలజీ టెక్నీషియన్ గా పని చేస్తున్నారు. ఈయన భార్య ట్వింకిట్ రవికాంత్ (40) దంత వైద్యురాలిగా పని చేస్తున్నది. దంపతుల మద్య చాల కాలం నుంచి గొడవలు ఉన్నాయి.

ఇరు కుటుంబ పెద్దలు సైతం అనేక సార్లు రాజీ చేసి దంపతులకు బుద్దిమాటలు చెప్పారు. సర్దుకుని కాపురం చేసుకుని వెళ్లాలని సూచించారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.

Women dentist stabs husband to death in Nagpur

ఆదివారం చిన్న విషయంలో ఇద్దరి మద్య గొడవ జరిగింది. మాటామాట పెరిగింది. ఆ సందర్బంలో సహనం కొల్పోయిన ట్వింకిల్ కత్తి తీసుకువచ్చి భర్త రవికాంత్ ను ఇష్టం వచ్చినట్లు పొడిచింది. రవికాంత్ కడుపులో తీవ్రగాయాలైనాయి.

తరువాత రవికాంత్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై రవికాంత్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్య కేసు నమోదు చేసి ట్వింకిల్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. క్షణికావేశంలో తన భర్తను పొడిచానని ట్వింకిల్ పోలీసుల విచారణలో అంగీకరించింది.

English summary
Ravikant Madhukar, who sustained multiple stomach injuries in the attack by his wife and was bleeding profusely, was rushed to a private nursing home where he died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X