వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల్లికట్టు ఆర్డినెన్సుపై అనుమానాలు, కదిలే ప్రసక్తే లేదు, లక్ష మంది !

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసినా చెన్నైలోని మెరీనా బీచ్ లో నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. వాస్తవానికి జల్లికట్టు ఆర్డినెన్సు మీద చాల మందికి అనేక అనుమానాలు ఉన్నాయి.

<strong>జల్లికట్టు బ్యాన్: సుప్రీం కోర్టు తీర్పు వారం వాయిదా ! ఎందుకంటే ?</strong>జల్లికట్టు బ్యాన్: సుప్రీం కోర్టు తీర్పు వారం వాయిదా ! ఎందుకంటే ?

భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలలను చల్లార్చేందుకు మాత్రమే ఏదో కంటితుడుపు చర్యగా ఈ ఆర్డినెన్సు జారీ చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్డినెన్సు తమకు చూపించాలని పట్టుబడుతున్నారు.

అంతేకాకుండా రాష్ట్రంలో జల్లికట్టు నిర్వహించాలని, ఆ తరువాత తాము ఇక్కడి నుంచి కదిలి వెళ్తామని మొరీనా బీచ్ లో గత ఐదు రోజుల నుంచి నిరసన తెలియజేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. పలువురు మహిళలు నిరసన తెలియజేస్తున్న వారికి మద్దతు ఇస్తూ ఇంటి నుంచి తీసుకు వచ్చిన అన్నం ముద్ద కలిపి స్వయంగా వారే అక్కడ ఉన్న యువకులకు తినిపిస్తున్నారు.

Women participated in Jallikattu protest vigorously

<strong>ఒకటి రెండురోజుల్లో జల్లికట్టు: పన్నీర్, మీ పని మీరు చూసుకోండి</strong>ఒకటి రెండురోజుల్లో జల్లికట్టు: పన్నీర్, మీ పని మీరు చూసుకోండి

ఇది ఇలా ఉంటే శనివారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో జల్లికట్టుకు మద్దుతుగా నిరాహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నిరాహార దీక్షలో డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, కరుణానిధి కుమార్తె, డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు దురై స్వయంగా నిరాహార దీక్షలో పాల్గొని జల్లికట్టు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

English summary
DMK treasurer M.K. Stalin and senior party leader S. Durai Murugan lead protesters and stage a daylong hunger strike at Valluvar kottam in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X