వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శక్తిమంతమైన నేత: ‘టైమ్’ ప్రశంస, జన్‌ధన్‌పై ప్రపంచ బ్యాంక్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత ప్రధాని మోడీపై టైమ్స్‌ మేగజైన్‌ ప్రశంసల వర్షం కురిపించింది. మోడీని దార్శనికతగల శక్తిమంతుడైన నేతగా అభివర్ణించింది. మోడీతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పైనా ప్రశంసలు కురిపించింది. భారత్‌, చైనాల నేతలు పాలనలో తమదైన ముద్ర వేయడం కోసం శ్రమిస్తున్నారని వ్యాఖ్యానించింది.

భారత్‌లో మన్మోహన్‌, చైనాలో హూజింటావోల దశాబ్దపు పాలన నిర్లక్ష్యపూరితమని పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత స్ఫూర్తిదాయక వంద మంది నేతల జాబితాలో మోడీకి చోటు దక్కినట్లు టైమ్స్‌ ప్రకటించింది. ఈ జాబితాలోని నేతలను విశ్లేషిస్తూ.. దశాబ్దాలపాటు చురుకుదనం లోపించిన రాజకీయ నేతలనే చూసిన ఆసియా ప్రస్తుతం శక్తిమంతులైన పాలకులను చూస్తోందని అభిప్రాయపడింది.

మోడీ గత పాలకులకు భిన్నంగా పనిచేయడం మొదలుపెట్టారని, అది ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో.. నిరుడు మాడిసన్‌ స్క్వేర్‌లో ఆయనకు లభించిన అపురూప స్వాగతమే ఉదాహరణ అని టైమ్ మేగజైన్ పేర్కొంది.

 World Bank chief praises PM's Jan Dhan Yojna

జన్‌‌ధన్‌ యోజనకు ప్రపంచ బ్యాంకు ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ లాంటి ఒక బలమైన, దూరదృష్టి గల నాయకత్వం నేతృత్వంలో చేపట్టిన అసాధారణ చర్యల కారణంగా భారత్‌లోని ప్రజలకందరికీ ఆర్థిక సేవలు దగ్గరయ్యాయని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌ యాంగ్‌ కిమ్‌ ప్రశంసించారు. ప్రధాని జన్‌ధన్‌ యోజన పథకం మొదలైన ఏడు నెలల్లోనే దేశంలో 12.5 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభమైనట్లు ప్రపంచ బ్యాంకు ఈ వారంలో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.

'ఇది అసాధారణరీతిలో చేపట్టిన చర్యల ఫలితమ'ని ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశంలో కిమ్‌ పేర్కొన్నారు. 2013 నాటి సర్వే ప్రకారం 40 కోట్ల మేర మాత్రమే భారత్‌లో బ్యాంకు ఖాతాలున్నాలున్నాయన్న ఆయన, పేదరికాన్ని పారదోలడానికి ఆర్థిక సేవలు ఉపయోగపడగలవని తెలిపారు. ఇదంతా ప్రధాని మోడీ, ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ల బలమైన, ముందుచూపుగల నాయకత్వం వల్లే జరిగిందని కిమ్‌ పేర్కొన్నారు.

English summary
The World Bank chief Jim Yong Kim today said that the "strong visionary leadership" of Prime Minister Narendra Modi has resulted in "extraordinary effort" by India on financial inclusion of its people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X