వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి, తండ్రి కాదు.. మన దగ్గరుంది ‘తాత’! దీనిముందు అమెరికా, రష్యా బలాదూర్!!

అమెరికా ‘తల్లిబాంబు’.. రష్యా ‘తండ్రిబాంబు’లను మించిన బాంబు.. వాటికి ‘ తాత’ లాంటి బాంబు ఎవరి దగ్గర ఉందో మీకు తెలుసా? మన దగ్గర. నిజం.. చదవండి మీకే తెలుస్తుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రేడియేషన్‌ విడుదల చేయని అతి శక్తిమంతమైన మాసివ్‌ ఆర్డినెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌ బాంబ్‌(ఎంఓఏబీ) ఆప్ఘనిస్తాన్‌లోని ఐసిస్‌ స్ధావరంపై ప్రయోగించినట్లు అమెరికా పేర్కొంది. ఈ బాంబుకు మరో పేరు 'మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌'(ఎంఓఏబీ).

ఇటీవల అమెరికా ప్రయోగించిన ఈ బాంబు దాడిలో దాదాపు 100 మంది తీవ్రవాదులు హతం కావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రష్యా స్పందించింది. తమ వద్ద దీన్ని మించిన 'ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌'(ఎఫ్ఓఏబీ) ఉందంటూ పేర్కొంది.

మన దగ్గరుంది ‘తాత’...

మన దగ్గరుంది ‘తాత’...

అయితే, అసలు రేడియేషన్‌ కలిగించని శక్తిమంతమైన బాంబు ఎవరి దగ్గరుందో మీకు తెలుసా? మన దగ్గర. అవును.. భారత్‌ వద్ద రేడియేషన్‌ కలిగించని శక్తిమంతమైన బాంబు ఉంది.

15 రెట్లు శక్తిమంతమైనది...

15 రెట్లు శక్తిమంతమైనది...

దీనిని ఆరేళ్ల క్రితమే మన డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. దీని పేరు సీఎల్‌-20. సంప్రదాయ పేలుడు పదార్ధాల కంటే 15 రెట్లు ఇది శక్తిమంతమైనది. అయితే, దీనిని ఎలా ప్రయోగిస్తారు అనే విషయం మాత్రం సీక్రెట్‌.

‘స్పైస్’ కూడా...

‘స్పైస్’ కూడా...

ఇక ఇండియా వద్ద ఉన్న మరో బాంబు పేరు ‘స్మార్ట్‌ ప్రిసైజ్‌ ఇంపాక్ట్ అండ్‌ కాస్ట్‌ ఎఫెక్టీవ్‌'(ఎస్‌పీఐసీఈ). సింపుల్‌గా దీనిని ‘స్పైస్‌' అంటారు. దీనిని కార్గో విమానాల నుంచి ప్రయోగించాల్సిన అవసరం లేదు.

ప్రయోగించడం సులువు...

ప్రయోగించడం సులువు...

ఇండియా వద్ద గల మిరేజ్‌ 2000, సుఖోయ్‌ జెట్ల నుంచి సులువుగా ఈ స్పైస్ బాంబును మోసుకెళ్లొచ్చు. ఉగ్రవాదుల స్ధావరాలను నేల మట్టం చేయాలనుకున్న సమయంలో దీన్ని భారత్‌ ఉపయోగించుకునే అవకాశం ఉంది.

ఫస్ట్ చాయిస్ ఇదే...

ఫస్ట్ చాయిస్ ఇదే...

‘స్పైస్‌'ను అభివృద్ధి చేసింది ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. స్పైస్‌ బాంబు బరువు కేవలం 1000 కేజీలు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ లాంటి వాటిని ఎయిర్‌ఫోర్స్‌ ద్వారా నిర్వహించాలనుకుంటే మొట్టమొదట ఎంచుకునేది ఈ ‘స్పైస్' బాంబునే.

English summary
SPICE (smart precise impact and cost effective) bomb is the most powerful non-nuclear weapon possessed by India. Manufactured by Israeli firm Rafael Advanced Defence Systems Ltd, SPICE is an air-droppable unguided bomb which can be carried by Mirage 2000 fighters. IAF has also tested it with Sukhoi-30 MKI fighter, which can carry 26 bombs of 550-lb class. SPICE used by IAF weighs around 450 Kgs and is around 3 meters long. But, SPICE is just not in the same league as MOAB or FOAB. Reports say that even China and Pakistan do not have conventional bombs that match up to what US and Russia have.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X