బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేఆఫ్: ట్రేడ్‌ యూనియన్‌‌ను ఏర్పాటు చేసుకొన్న టెక్కీలు

ఉద్యోగ భద్రత కోసం టెక్కీలు బెంగుళూరులో ట్రేడ్ యూనియన్‌ను ఏర్పాటుచేసుకొన్నారు.బెంగుళూరుతో పాటు చెన్నైలో కూడ యూనియన్ ఏర్పాటుకు చర్యలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: సాఫ్ట్‌వేర్ రంగంలో చోటుచేసుకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎప్పుడు ఉద్యోగాలు పోతాయనే భయంతో టెక్కీలు ట్రేడ్ యూనియన్ ఏర్పాటుచేసుకొన్నారు.సాప్ట్‌వేర్ కంపెనీలు అన్యాయంగా ఉద్యోగులను తొలగించే ప్రక్రియకు చెక్ పెట్టేందుకు టెక్కీలు యూనియన్‌ను ఏర్పాటుచేసుకొన్నారు.

టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో 4 వేల మంది ఉద్యోగులపై వేటుటెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో 4 వేల మంది ఉద్యోగులపై వేటు

ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో ఉంది. దీంతో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించే పనిలో పడ్డాయి.

దీంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతోందోననే ఆందోళన టెక్కీల్లో నెలకొంది.ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ భద్రత కోసం ట్రేడ్ యూనియన్‌ను ఏర్పాటుచేసుకొన్నారు.

టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగుల్లో కోత, ఏటా 60 మిలియన్ డాలర్ల ఆదాటెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగుల్లో కోత, ఏటా 60 మిలియన్ డాలర్ల ఆదా

ఇప్పటికే కొన్ని చోట్ల తమను అన్యాయంగా ఉద్యోగాల నుండి తొలగించారంటూ కొందరు టెక్కీలు కార్మికశాఖను కూడ ఆశ్రయించారు. అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొన్న నిర్ణయాలు ఇండియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

బెంగుళూరులో ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకొన్న టెక్కీలు

బెంగుళూరులో ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసుకొన్న టెక్కీలు

ఇండియా సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగ‌ళూరులో నిన్న ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు ఫ‌స్ట్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ పేరిట ఓ స‌మావేశం ఏర్పాటు చేసి ట్రేడ్ యూనియ‌న్‌ను ఏర్పాటు చేసుకొన్నారు.న‌గ‌రంలోని కోర‌మంగ‌ళ‌లో జ‌రిగిన‌ ఈ సమావేశంలో దాదాపు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. కర్ణాట‌క‌లోని సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప‌రిస్థితులు త‌లెత్తుతుండ‌డంతో యూనియ‌న్‌ను ఏర్పాటు చేసుకొన్నారు.

ఐక్యంగా పోరాటం

ఐక్యంగా పోరాటం

క‌ర్ణాట‌క రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) ప్ర‌తినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.. త‌మ ఇండ‌స్ట్రీలో ఉద్యోగులు ఎదుర్కుంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి, వాటి ప‌రిష్కారం కోసం ఐక్యంగా పోరాడ‌డానికి ట్రేడ్ యూనియ‌న్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ప్ర‌స్తుతం ఏ ఐటీ సంస్థ‌లోనైనా ఉద్యోగి ఏదైనా స‌మ‌స్య ఎదుర్కుంటే ఆ ఉద్యోగి ఒక్క‌డే సంస్థ‌తో పోరాడాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. ఐక్యంగా పోరాటం చేసేందుకు ట్రేడ్ యూనియన్ అవసరమని భావించినట్టు చెప్పారు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు

ప్రభుత్వం ముందు సమస్యలు

ప్రభుత్వం ముందు సమస్యలు

యూనియన్ ఏర్పాటుచేసుకోవడం ద్వారా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి చెప్పేందుకు వెసులుబాటు కలుగుతోందని ఐటీ ఉద్యోగులు కొందరు అభిప్రాయంతో ఉన్నారు.ఇలా ఎవ‌రికి వారు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఒంట‌రిగా చెప్పుకుంటే కంపెనీ అధినేత‌లు వారు చెప్పేది వినిపించుకోవ‌డం లేద‌ని అన్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై పోరాటం నిర్వహించనున్నట్టు చెప్పారు యూనియన్ నేతలు.

చెన్నెైలో కూడ ట్రేడ్ యూనియన్

చెన్నెైలో కూడ ట్రేడ్ యూనియన్

ఐటీ ఇండస్ట్రీలోని ఉద్యోగులు ప్ర‌స్తుతం ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కుంటున్నార‌ని తెలిపారు. బెంగ‌ళూరులోని ఐటీ ఇండస్ట్రీ ఉద్యోగులు మాత్ర‌మే కాకుండా చెన్నై ఉద్యోగులు కూడా యూనియ‌న్ ఏర్పాటు చేస్తున్నార‌ని అన్నారు. ఈ రెండు న‌గ‌రాల ఐటీ ఉద్యోగులు భ‌విష్య‌త్తులో దేశమంత‌టా యూనియ‌న్‌ను విస్తృతప‌ర్చ‌డానికి కృషి చేస్తార‌ని తెలిపారు.

English summary
Worried by unprecedented layoffs and “injustices” meted out to employees working in the IT/ITeS (Information Technology enabled services) industry, a group of IT employees in the city have banded together to form a registered trade union. The first meeting announcing the registration of the union will be held on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X