వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాకూబ్ మెమెన్ ఉరి శిక్ష, సుప్రీం కోర్టు స్టే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల నిందితుడు యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమెన్ అలియాస్ యాకూబ్ మెమెన్ ఊపిరిపీల్చుకున్నాడు. అతను సుప్రీం కోర్టులో సమర్పించిన పిటిషన్ మంగళవారం విచారించిన న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.

ముంబై వరుస బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమెన్ ఉరి శిక్షను రద్దు చెయ్యాలని దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం జస్టిస్ ఏఆర్. దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేసింది. స్టే విధించడానికి న్యాయమూర్తి దవే నిరాకరించారు.

ఉరి శిక్షను అమలు చెయ్యడాన్ని న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేయ్యడంతో పిటిషన్ ను అత్యున్నత స్థాయి ధర్మాసనానికి బదలి చేస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. తుది నిర్ణయం ప్రధాన న్యాయమూర్తి కే. ఎల్. దత్తు తీసుకుంటారు.

Yakub Memon's petition to stop his hanging on Thursday

1993లో ముంబై నగరంలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో అరెస్టు అయిన యాకూబ్ మెమెన్ కు ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. తరువాత ఇతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

సుప్రీం కోర్టు సైతం ఇతని శిక్ష రద్దు చెయ్యడానికి నిరాకరించి ఉరి శిక్ష విదించింది. రాష్ట్రపతి యాకూబ్ మెమెన్ పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీని తిరస్కరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమెన్ ను జులై 30వ తేదిన ఉరి తీయ్యాలని నిర్ణయించింది.

నాగ్ పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమెన్ ను ఉరి తియ్యడానికి అన్ని ఎర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. గురువారం యాకూబ్ మెమెన్ ను ఉరి తియ్యడానికి సిద్ధం అవుతున్న సమయంలో సుప్రీం కోర్టు యాకూబ్ మెమెన్ ఉరి శిక్షపై స్టే విధించింది.

English summary
It is now up to the Chief Justice of the Supreme Court, H L Dattu to take a final call on the matter. The Chief Justice will have to constitute a larger bench to hear the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X