వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు భోజనం, చిన్న నేరగాళ్ల గదిలోనే: నాడు జైల్లో సల్మాన్ ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: 2002లో కారు ప్రమాదం జరిగిన సమయంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కొన్ని రోజుల పాటు కటకటాల వెనుక ఉన్నాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ జైలులో ఎలా ఉన్నాడనే విషయాన్ని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో సల్మాన్ ఎంతో సాధారణంగా వ్యవహరించాలని పోలీసులు సమాచారం ఇచ్చారు.

బాంద్రా స్టేషన్‌లో ఉన్న సల్మాన్ ఖాన్.. ఇంటి దగ్గర నుండి భోజనం తీసుకు వస్తే తిరస్కరించారని, అక్కడ నిందితులతో పాటే భోజనం చేసేవాడని గుర్తుకు చేసుకున్నారు. కనీసం ఇంటి దగ్గర నుండి తెచ్చిన టీని కూడా తాగేవాడు కాదని చెప్పారు.

చిన్నచిన్న నేరగాళ్లతో కలిసి ఒకే గదిలో ఉన్నారని వివరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనకు బెయిల్ దొరికిందని పోలీసులు చెప్పారు.

కాగా, కాగా, హిట్ అండ్ రనే కేసులో సల్మాన్ ఖాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. కారు నడిపే సమయంలో సల్మాన్ ఖాన్ మద్యం సేవించి ఉన్నాడని కోర్టు స్పష్టం చేసింది. ఆ సమయంలో తాను కారు నడపలేదని, డ్రైవ్ నడిపాడనే సల్మాన్ వాదనను కోర్టు కట్టు కథగా పేర్కొంది. ఆ సమయంలో సల్మాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తేల్చింది.

 Yerwada jail in Pune is better suited to keep Salman Khan: Police

సల్మాన్ ఖాన్ మీద ఉన్న 8 అభియోగాలు నిరూపణ కావడంతో కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. కోర్టు తీర్పు అనంతరం పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయస్థానం అతనికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం అతడికి రెండు రోజుల పాటు బెయిల్ వచ్చింది.

మరోవైపు, సల్మాన్ ఖాన్‌కు బెయిల్ దొరకకుంటే ఎక్కడ ఉంచుతారనే చర్చ సాగింది. అతనిని పుణేలోని ఎరవాడ జైలులో ఉంచడం మంచిదని పోలీసు వర్గాలు అభిప్రాయపడ్డాయి. కోర్టు బెయిల్ తిరస్కరించి ఉంటే అతనిని తొలుత ఆర్థర్ రోడ్డులోని జైలుకు తీసుకు వెళ్లేవారని చెబుతున్నారు.

ఆ జైలులో కేవలం అండర్ ట్రయల్ నిందితులను మాత్రమే ఉంచుతారు. ఆ తర్వాత మరో జైలుకు తరలించే వారని చెప్పారు. సల్మాన్ ఖాన్‌ను థానే లేదా తలోజా జైలులో పెట్టే అవకాశాలున్నాయని, సెక్యూరిటీ కారణాల వల్ల యెరవాడ జైలుకు తరలించే అవకాశాలు ఎక్కువగా ఉండేవంటున్నారు.

English summary
Yerwada jail in Pune is better suited to keep Salman Khan: Police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X