యోగి మరో సంచలనం: మంత్రులకు షాక్, ప్రవర్తన నియమావళి

Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో దూసుకు పోతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనం అవుతోంది. తాజాగా, తన పాలనలో పారదర్శకత కోరుకుంటున్నారు. ఆ దిశలో ఆయన దూసుకు వెళ్తున్నారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని బీజేపీ గెలిచిన అనంతరం యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పడు నుంచి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. తన సంచలనాత్మక నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

దటీజ్ యోగి ఆదిత్యనాథ్: అందరు సీఎంలు ఓకవైపు, ఈయన ఒకవైపు

తాజాగా మంగళవారం రాష్ట్ర మంత్రులు ఏటా తమ ఆస్తులను ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 31లోగా ఆస్తుల ప్రకటన ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. హెచ్చరిక

ఆస్తులు ప్రకటించే విషయంలో నిర్లక్ష్యధోరణితో వ్యవహరించే వారికి హెచ్చరికలు చేశారని తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించేవారంతా గుత్తేదారులు, వ్యాపారవేత్తలకు దూరంగా ఉండాలని ఇప్పటికే యోగి సూచించారు.

విలాసాలకు దూరం

రూ.5వేల కంటే ఎక్కువ విలువచేసే బహుమతులను నిరాకరించాలని కూడా ఆయన సూచించారు. విలాసవంతమైన ఆస్తులు, పార్టీలు, డిన్నర్‌లకు మంత్రులు దూరంగా ఉండాలన్నారు.

ఎవరైనా బస ఏర్పాటు చేస్తే తిరస్కరించాలి

వ్యక్తిగత, అధికారిక పర్యటనలు ఏమైనప్పటికీ మంత్రులు ప్రభుత్వ అతిథిగృహాల్లోనే బసచేయాలన్నారు. ఒకవేళ ఎవరైనా తమ బసకు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినా తిరస్కరించాలని సూచించారు. మంత్రులు, అధికారులు ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.

 

ప్రవర్తన నియమావళి

ప్రభుత్వంతో సంబంధం ఉన్న మంత్రుల బంధువుల వివరాలు వెల్లడించాలి. తమ పదవులను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేయవద్దు. ఆర్బాటపు వేడుకలకు దూరంగా ఉండాలి. 5వేల కంటే ఖరీదైన బహుమతులు తీసుకోవద్దు. తీసుకుంటే ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. ప్రభఉత్వ నివాసాల్లోనే బస చేయాలి.

English summary
The ministers in the Bharatiya Janata Party government have also been told to keep a distance from contractors and business entities.
Please Wait while comments are loading...