వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో నిద్రపోయిన ఎమ్మెల్యేలకు యోగి క్లాస్: రిపీట్ కావద్దని హెచ్చరిక!

ఈ వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా లైవ్ ప్రసారం చేయిస్తే.. ఇలాంటి పరిస్థితి కల్పించి పార్టీకి ఇబ్బంది కొనితెచ్చారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కునుకు తీసిన మంత్రిని

|
Google Oneindia TeluguNews

లక్నో: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సమావేశమైన యూపీ అసెంబ్లీలో.. కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఓ మంత్రి కునుకేసిన సంగతి తెలిసిందే. తొలిసారిగా యూపీ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా లైవ్ ప్రసారం చేసిన నేపథ్యంలో.. యూపీ నేతల నిద్రను ప్రజలంతా వీక్షించారు. దీంతో అధికార పార్టీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

అసెంబ్లీలో హాయిగా కునుకేసిన ఎమ్మెల్యేలు: అంత సీరియస్ చర్చ జరుగుతుంటే!..అసెంబ్లీలో హాయిగా కునుకేసిన ఎమ్మెల్యేలు: అంత సీరియస్ చర్చ జరుగుతుంటే!..

ఈ వ్యవహారంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. సమావేశాలను తొలిసారిగా లైవ్ ప్రసారం చేయిస్తే.. ఇలాంటి పరిస్థితి కల్పించి పార్టీకి ఇబ్బంది కొనితెచ్చారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో కునుకు తీసిన మంత్రిని ప్రత్యేకంగా చాంబర్ కు పిలిపించుకుని క్లాస్ పీకినట్లు సమాచారం.

yogi warned mla's and minister who slept in assembly

బాధ్యాతయుతమైన మంత్రి పదవిలో ఉండి.. ఓవైపు ప్రజాసమస్యలపై సీరియస్ గా చర్చ జరుగుతుంటే, నిద్ర ఎలా వస్తుందని నిలదీశారు. దీంతో జరిగిన దానికి సదరు మంత్రి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రాత్రంతా నియోజకవర్గంలో పర్యటించినందువల్లే తనకు నిద్ర ముంచుకొచ్చిందని మంత్రి చెప్పారట. దీంతో మరోసారి ఇలాంటి పరిస్థితి కల్పించవద్దని సీఎం యోగి ఆయన్ను హెచ్చరించి పంపించారట.

English summary
Uttarpradesh CM Yogi Adityanth warned party MLA's and Minister who slept in Assembly during the discussion on GST bill
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X