వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజంగా మీరేనా?: సుష్మాకు ట్విట్టర్‌లో ప్రశ్న, నెటిజన్ల ప్రశంసలు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే కేంద్రం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్‌లో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తుండటం, వాటికి ఆమె ఎంతో ఓపికగా సమాధానం చెబుతుండటం మనం చూస్తూనే ఉన్నాం.

రాజకీయాలే కాకుండా తమ వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన విషయాలకు కూడా ఆమె తన ట్విట్టర్ ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. ఇటీవలే ఓ వ్యక్తి తన భార్య లేకుండా హానీమూన్‌కు వెళ్తోన్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

దీనిపై వెంటనే స్పందించిన సుష్మా అతడితో పాటు భార్యను హానీమూన్ పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించిన సంగతి మనం చూశాం. తాజాగా, సుష్మా స్వరాజ్‌కు ట్విట్టర్ ఖాతాదారుడు ఒకరు

'సుష్మా స్వరాజ్.. నిజంగా మీరేనా? భారత రాజకీయ నాయకుల లక్షణాలు మీలో లేవు. ఎందుకంటే, మీరు, మా గురించి, అదే, భారతీయుల గురించి ఆలోచిస్తున్నారు!' అంటూ సదరు వ్యక్తి ఆమెను పొగుడుతూనే ప్రశ్నించాడు.

ఈ ట్వీట్‌కు సుష్మా మాత్రం చాలా హుందాగా, గౌరవప్రదంగా స్పందించింది. 'దయచేసి అలాంటి భావాలతో ఉండొద్దు, భారత రాజకీయ నేతలు చాలా సున్నిత మనస్కులు. సాయపడాలనే తత్వం బాగా ఉన్నవారు' అంటూ ఆమె పేర్కొన్నారు.

సుష్మా స్వరాజ్ సమాధానం చెప్పిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ ఒక్క ట్వీట్ రికార్డుని సృష్టించింది. సుష్వా ట్వీట్ చేసిన 13 గంటల్లో ఈ ట్వీట్‌ను 1000 మందికి పైగా లైక్ చేయగా, 350 మంది రీట్వీట్ చేశారు.

English summary
Dear people of the Internet, you ought to know by now that Minister for External Affairs Sushma Swaraj has snappier comebacks than you could ever hope to have. Those of you still learning, know that her response is going to be smart and dignified - much more than this man's poor attempt at trolling her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X