వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్‌ఐఎస్‌లో 10 మంది భారత యువకులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో పది మంది భారతీయ యువకులు ఉన్నారు. వారు ఇరాక్‌, సిరియాల్లో ఆ సంస్థ తరుఫున పలు దాడుల్లో పాల్గొంటున్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్‌లు జరిపిన ఓ సమావేశంలో భాగంగా ఆస్ట్రేలియా ఈ విషయాన్ని భారత్‌కు తెలిపింది.

ఐఎస్‌ఐఎస్‌కి ఆకర్షితులై భారత్‌ నుంచి ఆ ఉగ్రవాద సంస్థలోకి భారత యువకులు వెళుతున్న అంశంపై కేంద్ర హోంశాఖ గతంలోనే స్పందించింది. దీనిపై కేంద్ర హోంశాఖ 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీసు అధికారులతో ఇటీవల ఓ సమావేశం ఏర్పాటు చేసి చర్చించింది.

కాగా, భారత్‌ అనుకున్న దానికంటే ఇప్పుడు ఆస్ట్రేలియా చెబుతున్న భారతీయుల సంఖ్య అధికంగా ఉంది. అయితే ఆస్ట్రేలియా పరిస్థితితో పోల్చితే ఇది చాలా తక్కువే. యువతకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం ద్వారా వారు ఉగ్రవాదంవైపు ఆకర్షితులు కాకుండా భారత్ చూస్తోంది.

 10 Indians fighting for IS, anti-terror officials reveal

కాగా, ఇటీవల 17మంది భారతీయ యువకులు అదృశ్యమైన విషయం తెలిసిందే. వారు కూడా ఐఎస్ఐఎస్‌లో చేరి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాద సంస్థలో చేరేందుకు ప్రయత్నించిన మరో 22 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా, ఆస్ట్రేలియా నుంచి 150 మంది యువత ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి ఇరాక్‌, సిరియా వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో 60 మంది అక్కడే పనిచేస్తున్నట్లు తెలిసిందని, 30 మంది తిరిగివచ్చారని అక్కడి అధికారులు వెల్లడించారు.

English summary
As many as 10 Indian youths are currently engaged in the Islamic State (ISIS) "war" in Syria/Iraq, according to an assessment shared by India with Australia at a meeting of their joint working group on counter-terrorism here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X