వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జలోత్సవాలకు వెళ్లి 11 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

యంగాన్: బర్మా దేశంలో నూతన సంవత్సరం సందర్బంగా జరుపుకునే ఉత్సవాలలో అపస్పృతి చోటు చేసుకునింది. సుమారు 11 మంది దుర్మరణం చెంది 134 మంది వరకు గాయపడ్డారని మయన్మార్ ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరించారు.

బర్మాదేశీయులు నూతన సంవత్సరం సందర్బంగా యేటా నాలుగు రోజుల పాటు నీటి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎప్పటిలాగే శుక్రవారం నీళ్ల ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.

11 killed Myanmar water festival

చిన్న పెద్ద అని తేడా లేకుండ మహిళలు, పురుషులు కలిసి ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుని పండగ చేసుకుంటారు. ఈ నీటి ఉత్సవాలు జరుపుకోవడానికి మయన్మార్ లో 200 మంటపాలు ఏర్పాటు చేశారు. అనుకున్న దాని కంటే ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరైనారు.

ఆ సందర్బంలో తొక్కిసలాట జరిగింది. అదే విధంగా డ్రగ్స్, మద్యం సేవించి వాహనాలు నడపడంతో సుమారు 60 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలలో 11 మంది మరణించారు. 134 మంది గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. గత సంవత్సరం నీటి ఉత్సవాలలో 15 మంది మరణించారు, 178 మంది గాయపడ్డారు.

English summary
11 people were killed and 134 injured during Myanmar's annual four-day Thingyan Water Festival
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X