వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెలానియా ట్రంప్ కు షాక్ మీద షాక్: మేం చెయ్యం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కు ఫ్యాషన్ డిజైనర్లు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ టామ్ ఫోర్డ్ తాజాగా తను మలానియాకు దుస్తులు డిజైన్ చెయ్యనని తేల్చి చెప్పారు.

అమెరికా తొలి మహిళగా చెప్పుకునేందుకు ఆమె సరిపోరని, అందుకు ఆమె అనర్హురాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువలన మలానియాకు తాను ఎటువంటి పరిస్థితుల్లో దుస్తులు డిజైన్ చెయ్యనని కుండలుబద్దలు కొట్టి చెప్పారు.

ఇటీవలే మరో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సోఫీ థియల్లెట్ కూడా తాను మెలానియాకు దుస్తులు డిజైన్ చెయ్యనని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష, సెక్సిజం కారణంగా తానీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

17 things you may not know about Donald Trump’s wife

కొన్ని సంవత్సరాల క్రితం మెలానియా తనకు దుస్తులు డిజైన్ చెయ్యమని చెప్పారని, అయితే తన ఊహలకు అనుగుణంగా ఆమె లేరని, అందుకు తాను దుస్తులు డిజైన్ చెయ్యనని తేల్చి చెప్పానని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఫోర్డు చెప్పారు.

ఒక వేళ అమెరికా ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ విజయం సాధించినా తాను మెలానియాకు దుస్తులు డిజైన్ చెయ్యనని మరో ఫ్యాషన్ డిజైనర్ అన్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ థియల్లెట్ తాను మెలానియాకు దుస్తులు డిజైన్ చెయ్యనని, మీరు ఎవ్వరూ డిజైన్ చెయ్యరాదని గత నవంబర్ నెలలో ఏకంగా బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు 17 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు మెలానియాకు దుస్తులు డిజైన్ చెయ్యడానికి నిరాకరించారు.

English summary
I was asked to dress her quite a few years ago and I declined; she’s not necessarily my image,” he said, explaining that “even had Hillary won she shouldn’t be wearing my clothes, they’re too expensive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X