వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2,600 ఏళ్ల నాటి మయన్ల నగరం గుర్తింపు, ప్రత్యేక గ్రిడ్ లే అవుట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రత్యేక గ్రిడ్ లే అవుట్‌తో నలువైపులా గోడలు కలిగిన రెండువేల ఆరువందల ఏళ్ల నాటి మయన్ల నగరం వెలుగులోకి వచ్చింది. పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని కనుగొన్నారు. ఈ నమూనా ద్వారా దీనిని పర్యవేక్షించిన పాలకుడు చాలా శక్తిమంతమైనవాడని తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.

గాటేమాలాలోని పీటెన్‌లో నిక్స్‌టన్‌చీచ్ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో శాస్త్రవేత్తలు ఈ నగరాన్ని గుర్తించారు. దీనిలో ఉన్న సమతల పైభాగంతో కూడిన పిరమిడ్లు దాదాపు క్రీస్తుపూర్వం 600 నుండి క్రీస్తుపూర్వం 300 ఏళ్ల మధ్యకాలంలో వాడుకలో ఉండేవని, ఇదే కాలంలో ఈ ప్రాంతంలో మొదటి నగరాలను నిర్మించారని పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది.

2600-year-old Mayan city with unique grid layout found

మయన్‌ల నుండి గ్రిడ్‌లను ఉపయోగించి మరే ఇతర వరల్డ్ క్లాస్ నగరం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడున్నటువంటి నగరాన్ని ఎక్కడా చూడలేదని న్యూయార్క్‌లోని క్వీన్స్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న టిమోతీ పా చెప్పారు. ఇది మొత్తం పద్ధతి ప్రకారం ఉందని చెప్పారు.

English summary
Archaeologists have found a walled Mayan city from 2,600 years ago that followed a unique grid pattern, suggesting the ruler who oversaw the design was a very powerful person.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X