వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపరిచితురాలు: 37ఏళ్ల 'అంధురాలు'.. 'టీనేజ్ గర్ల్'గా చూడగలదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెర్లిన్: మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిత్వాలను అపరిచితుడు సహా పలు సినిమాల్లో మనం చూశాం. కానీ ఇప్పుడు బహుళ వ్యక్తిత్వాలు కలిగిన ఓ జర్మన్ యువతి అందరినీ విస్తుగొల్పుతోంది. ఇరవై ఏళ్ల వయస్సులో ప్రమాదంలో ఆమె దృష్టి కోల్పోయింది.

ఆమె వయస్సు ఇప్పుడు 37. విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉంది. మరీ ఆశ్చర్యకరమైన విషయమేమంటే.. 37 ఏళ్ల వయస్సులో ఓ చిన్న వయస్సు వ్యక్తిలా చూడగలుగుతోంది. డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆమెను అప్పట్లో అంధురాలిగానే గుర్తించారు.

ఆమె అంధత్వం ఇప్పుడు మానసికమైనది కాకుండా శరీరానికి సంబంధించింగా భావిస్తున్నారు. అకస్మాత్తుగా మారే వ్యక్తిత్వాలు ఆమెకు కంటిచూపును ప్రసాదిస్తున్నాయి. ఆమె పది విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.

37 year old blind woman regains sight as teenage boy

చికిత్స సమయంలో ఏదో లోపం వల్ల డిజార్డర్ సంభవించినట్లుగా భావిస్తున్నారు. అందుకే యుక్త వయస్సులోని బాలిక చూడగలిగే సామర్థ్యాన్ని పొందిందని అంటున్నారు. ఆమెకు ఉన్న పది వ్యక్తిత్వాల్లోని ఎనిమిదికి సంబంధించిన చూపును తిరిగి చేజిక్కించుకుంది.

ఆమె దృష్టి సెకన్లలోనే మారిపోతోంది. దీంతో ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం పైనే దృష్టి ఆధారపడి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆమెకు అంధత్వం మెదడు దెబ్బతినడం వల్ల కాదని, శారీరకమైనదిగా భావిస్తున్నారు.

నాలుగేళ్ల చికిత్స అనంతరం ఆమె బాలికలా ప్రవర్తించడాన్ని వైద్యులు గమనించారు. ఆమె భావోద్వేగాలను బట్టి, స్పందనలను బట్టి దృష్టి మారుతుందని గుర్తించారు. ఆమె చూడాలనుకున్న సమయంలో చూడగలదని, వద్దనుకుంటే అంధురాలిగా మారిపోతుందని అంటున్నారు.

English summary
Blind woman with dissociative identity disorder can still see when in her teenage boy character.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X