వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే కాన్పులో 4గురు పిల్లలకు జన్మనిచ్చిన 65 ఏళ్ల బామ్మ, వరల్డ్ రికార్డ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన 65 ఏళ్ల బామ్మ ఒకే కాన్పులో నలుగురి పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె పేరు అనెగ్రెట్ రౌనిగ్. ఇప్పటికే 13 మంది సంతానాన్ని ఆమె కలిగి ఉన్నారు. ఇంకా తనకు పిల్లలు కావాలని భావించి ఉక్రెయిన్‌లోని ఓ ఆసుపత్రిలో ఆమె ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌ని తీసుకుంది.

ఈ ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌ని తీసుకున్న అత్యధిక వయసున్న మహిళగా రికార్డు సృష్టించింది. బెర్లిన్‌లో ఈ నెల 23వ తారీఖున ఓ ఆసుపత్రిలో ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ముగ్గురు మగ, ఒక ఆడ శిశువును బయటకు తీశారు. వీరి పేర్లు వరుసగా డ్రైస్, బెన్స్, ఫోజిన్, నీతా.

నెలలు పూర్తిగా నిండకుండానే 26 వారాలకే కాన్పు చేయాల్సి వచ్చిందని, చిన్నారులంతా 655 గ్రామల నుంచి 960 గ్రాముల మధ్య ఉన్నారని, వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో స్కూల్ టీచర్‌గా అనెగ్రెట్ రౌనిగ్ పని చేస్తున్నారు.

65-Year-Old German Woman Gives Birth To Miracle Quadruplets

స్కూల్లో ఇంగ్లీష్, రష్యన్ భాషలు బోదిస్తున్నట్లు అక్కడి స్ధానిక మీడియాలో వార్తలు వచ్చాయి. జర్మన్ పత్రిక బిల్డ్ కథనం ప్రకారం అనెగ్రెట్ రౌనిగ్ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చినా ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది.

అనెగ్రెట్ రౌనిగ్ బిల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తొలుత తాను ఒకే ఒక బిడ్డను కోరుకున్నట్లు తెలిపింది. అయితే అనుకోకుండా ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చానని పేర్కొన్నారు. తనకు పుట్టిన పిల్లలు తనని మరింతగా యంగ్‌గా ఉండేలా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటే, ప్రపంచంలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలను కన్న అత్యధిక వయస్కురాలుగా ఈమె రికార్డు సాధించారు. 66 ఏళ్ల వయసులో స్పానిష్‌కు చెందిన మారియా డెల్ కార్మిన్ బౌసాడా అనే మహిళ 2006లో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సాధించారు.

English summary
Single mother Annegret Raunigk may already have 13 children, but she just welcomed four more! The 65-year-old German woman gave birth to three boys and a girl on May 23, after undergoing fertility treatments in Ukraine. The quadruplets, however, were born prematurely at 26 weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X