వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఓ ఊరిని అమ్మేస్తున్నారు..

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా : అమ్మకానికి ఊరేంటని ఆశ్చర్యపడుతున్నారా..? కానీ ఇది నిజంగా నమ్మితీరాల్సిన నిజం. కాల్-నెవ్-అరి అనే అమెరికన్ విలేజ్ కి ఇప్పుడు టు-లెట్ బోర్డు తగిలించి కొనేవారి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏళ్ల క్రితం అమెరికన్ ప్రభుత్వం ఇచ్చిన వందల ఎకరాల భూమిని పొందిన నాన్సీ కిడ్ వెల్ అనే పెద్దావిడ ఇప్పుడు ఆ గ్రామాన్ని అమ్మకానికి పెట్టింది.

వివరాల్లోకి వెళ్తే.. దాదాపుగా 350 మంది జనాభా ఉండే కాల్ నెవ్ అరి గ్రామాన్ని 80 లక్షల డాలర్లకు అమ్మకానికి పెట్టింది నాన్సీ. 1960వ దశకంలో అమెరికా ప్రభుత్వం నుంచి నాన్సీ కుటుంబం 640 ఎకరాల భూమి పొందింది. క్రమంగా ఆ ప్రాంతమంతా ఒక ఊరుగా రూపుదిద్దుకుంది. ఊళ్లో ఒక హోటల్‌, జనరల్‌ స్టోర్‌, లాండ్రోమార్ట్‌, కమ్యూనిటీ సెంటర్‌, ఫైర్‌స్టేషన్‌, ఇలా వగైరా వసతులన్నీ ఏర్పాటయ్యాయి.

 FOR $8 MILLION, YOU CAN BUY THE ENTIRE TOWN OF CAL NEV ARI

పైగా ఆ ప్రాంతం కాలిఫోర్నియా, నెవెడా, అరిజోనా మూడు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న జంక్షన్ లో ఉంది. ఈ మూడు రాష్ట్రాల పేర్ల మీదుగనే గ్రామానికి కాల్ నెవ్ అరి అనే పేరొచ్చింది. అయితే, నాన్సీ వయసు పైబడడంతో ఇప్పుడు ఆ ఊరి బాగోగులు ఎవరు చూసుకుంటారనే బెంగ పెట్టుకుంది నాన్సీ. దీంతో ఊరిని ఎవరికైనా అమ్మేయడమే కరెక్ట్ అన్న నిర్ణయానికొచ్చిన నాన్సీ అందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

English summary
Who needs a home when you can have an entire town? The latest listing in the Silver State is a bargain.According to the AP, the border town of Cal Nev Ari, population 350, is now for sale for a mere $8 million dollars. Located 70 miles south of Vegas off U.S. Highway 95, the 500-acre town was founded by Nancy Kidwell and her late husband Slim in 1965. The couple wanted to build a town for pilots like themselves, with a fly-in casino, a central airstrip and backyard hangars. When they acquired 640 acres from the federal government, they installed a sign: "Cal-Nev-Ari, Population: 4. Watch Us Grow."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X