వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులపై ప్రశంసలు: 8 ఏళ్ల బాలుడిని ప్రశ్నించిన పోలీసులు

By Pratap
|
Google Oneindia TeluguNews

నైక్ (ఫ్రాన్స్): పాఠశాలలో ఉగ్రవాదులను ప్రశంసించాడనే ఆరోపణపై ఫ్రాన్స్ పోలీసులు 8 ఏళ్ల బాలుడిని విచారించారు. ఉగ్రవాదులను ప్రశంసిస్తూ ఆ బాలుడు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు చెప్పారు.

చార్లీ హెబ్డో వ్యంగ్య పత్రిక కార్యాలయంలో టెర్రరిస్టుల దాడిలో మరణించిన 12 మందికి సంతాపం ప్రకటిస్తూ నిమిషం పాటు మౌనం పాటించే కార్యక్రమం పాఠశాలలో జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ బాలుడు నిరాకరించాడు. ఆ బాలుడు సాయుధుడికి సంఘీభావం ప్రకటించినట్లు టీచర్ చెప్పారు.

8-Year-Old Questioned for Allegedly Praising Terrorists

ప్రస్తుత సందర్భంలో జరిగిన విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. బాలుడిపై ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎనిమిదేళ్ల బాలుడికి అంత తీవ్రమైన భావాలు ఎందుకు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఆ బాలుడిని, అతని తండ్రిని పిలిపించారు.

నిజానికి, తాను ఏం చెబుతున్నాడనే విషయంపై అచనితే స్పష్టత లేదని పోలీసులు అన్నారు. తాను టెర్రరిస్టుల వెంట ఉన్నానని ఆ బాలుడు పోలీసులకు చెప్పినట్లు ఆ బాలుడి తరఫున న్యాయవాది ట్విట్టర్‌లో పోస్టు ఉంది. ఆ ట్వీట్ ప్రకారం - టెర్రరిజం అంటే ఏమిటో తెలుసా అని పోలీసులు అడిగితే తనకు తెలియదని బాలుడు చెప్పాడు.

English summary
An eight-year-old boy in France was questioned by police for half after he allegedly made comments in school in praise of terrorists, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X