వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేలుళ్లతో దద్దరిల్లిన ఆఫ్గాన్: 56మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌ మంగళవారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. మూడు పేలుళ్లలో 56 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ మంగళవారం ఉగ్రవాదుల బాంబుపేలుళ్లతో దద్దరిల్లింది. మూడు పేలుళ్లలో 56 మంది మృతిచెందగా, వందమందికిపైగా గాయపడ్డారు. కాబూల్‌లోని పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో జరిగిన రెండు పేలుళ్లలో 38 మంది ప్రాణాలు కోల్పోగా, ఒక ఎంపీ సహా 72 మంది గాయపడ్డారు.

మొదట ఆత్మాహుతి దాడి, తర్వాత కారు బాంబు దాడి జరిగాయి. మృతుల్లో పలువురు పౌరులు, జవాన్లు ఉన్నారు. తామే దాడులు చేశామని తాలిబాన్‌ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా, హెల్మాంద్‌ రాష్ట్ర రాజధాని లష్కర్‌ ఘాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు చనిపోయారు.

After Kabul, twin blasts now rock Kandahar

కాగా, కాందహార్‌ రాష్ట్ర గవర్నర్‌ భవన ప్రాంగణంలో జరిగిన మరో పేలుడులో 9 మంది చనిపోగా, యూఏఈ రాయబారి అబ్దుల్లా కాబీ సహా 16 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటనాస్థలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

English summary
Two blasts took place at a guesthouse in Kandahar on Tuesday, where a meeting between UAE envoy, Kandahar' Governor and police chief was underway, said reports. All the three are reportedly safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X