వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోవల్ పర్యటన: డొక్లాం సమస్య పరిష్కారమవుతుందన్న చైనా నిపుణులు

భారత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ చైనా పర్యటన డొక్లాంలోని ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చైనాకు చెందిన రాజకీయ విశ్లేషకులు ఒకరు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో రాశారు.

|
Google Oneindia TeluguNews

బీజింగ్/న్యూఢిల్లీ: భారత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ చైనా పర్యటన డొక్లాంలోని ఉద్రిక్త పరిస్థితిని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని చైనా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్‌‌లో కూడా ఈ అభిప్రాయం వ్యక్తమయింది. అజిత్ దోవల్ చైనా పర్యటన ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఈ పర్యనటతో పరిష్కారం సులభతమవుతుందని అభిప్రాయపడ్డారు.

దోవల్‌ పర్యటనపై చైనాకు చెందిన పరిశోధకుడు మా జియాలి మాట్లాడుతూ.. ఆయన పర్యటన వల్ల డొక్లామ్‌ సరిహద్దు విషయంపై భారత్‌-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు.

ఇక యుద్ధమే, మీ ఓటమి ఖాయం, ఇదీ మా లెక్క: చైనా సంచలనంఇక యుద్ధమే, మీ ఓటమి ఖాయం, ఇదీ మా లెక్క: చైనా సంచలనం

Ajit Doval is a ray of hope says China amidst Doklam standoff

ఇరుదేశాల ఎన్‌ఎస్‌ఏలు కూర్చుని డొక్లాం వివాదంపై చర్చించుకుని సమస్య పరిష్కారం సులభతరం చేయవచ్చన్నారు.

చైనాలో జులై 27, 28 తేదీల్లో జరిగే బ్రిక్స్‌( బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి దోవల్‌ హాజరుకానున్నారు. చైనా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తుంది.

గత నెల రోజులుగా డొక్లాం సరిహద్దు వివాదంపై భారత్‌-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో ఉన్న భారత సైన్యం వెనక్కి వెళ్లాలంటూ చైనా తరచూ హెచ్చరికలు చేస్తూనే ఉంది.

ద్వైపాక్షిక చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని భారత్‌ చెబుతున్నా, చైనా మాత్రం అంగీకరించడం లేదు. సరిహద్దులో ఉన్న భారత సైన్యం వెనక్కి వెళితేనే చర్చలు అంటూ చెబుతోంది. అందుకు ప్రతిగా ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్యం వెనక్కి తగ్గే అవకాశం లేదని భారత్‌ తేల్చి చెప్పింది.

English summary
National Security Advisor Ajit Doval's visit to China will be important to ease tensions amidst the Doklam standoff an article in the Global Times has said. A Chinese analyst while making comments in the report said that Doval's visit may be key and would serve as an opportunity to ease India-China tensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X