వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ట్రంప్ వీసావిధానాలతో టెక్కీలకు దెబ్బ, నష్టపోతున్న ఐటీ కంపెనీలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వీసా విధానాలపై భారతీయ ఐటీ కంపెనీలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ట్రంప్ పాలసీలపై ఇప్పటికే కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. ట్రంప్ వీసా విధానాలు ఖచ్చితంగా ఇండస్ట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వీసా విధానాలపై భారతీయ ఐటీ కంపెనీలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. ట్రంప్ పాలసీలపై ఇప్పటికే కంపెనీలు గుర్రుగా ఉన్నాయి. ట్రంప్ వీసా విధానాలు ఖచ్చితంగా ఇండస్ట్రీని దెబ్బకొట్టనున్నాయని దేశీయంగా అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా హెచ్చరిస్తోంది.

శుక్రవారం నాడు మార్చి క్వార్టర్ ఫలితాల్లో 30.2 శాతం మేర ఈ కంపెనీ ఫలితాలు పడిపోయాయి. లాభాల్లో అంచనాలు కూడ తప్పాయి.

An Indian IT Giant Warns Trump's 'Radical Shift' To Hurt Industry

బలహీనమైన ఫలితాలతో కంపెనీ స్టాక్ నేటీ ట్రేడింగ్ ఏకంగా 17 శాతం మేర నష్టపోయింది. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాల పాలసీలపై ఉక్కుపాదం మోపడం, ఇది ఐటీ సెక్టార్ ను తీవ్రంగా దెబ్బతీస్తోందని టెక్ మహీంద్రా వైస్ చైర్మెన్ వినీత్ నాయర్ చెప్పారు.

వీసా కోటాలు, కేటాయింపులకు సంబంధించిన వెను వెంటనే మార్పులు చేపట్టేలా పాలసీలను తీసుకొన్నారని , దీంతో అమెరికాలో ప్రతిభావంతుల్ని తీసుకెళ్ళడానికి భార ఐటీ కంపెనీలకు ధరఖాస్తు ప్రక్రియ కఠినతరంగా మారి ఎక్కువ వ్యయాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఫలితాల ప్రకటన తర్వాత పలువురు అనలిస్టులు టెక్ మహీంద్రా రేటింగ్స్ ను తగ్గిస్తూ ధరల టార్గెట్ ను కోత పెట్టారు. ఒక్క ట్రంప్ పాలసీలు దేశీయ టెక్ కంపెనీల్లో మాత్రమే కాక, అక్కడి టెక్ దిగ్గజాల్లోనూ గుబులుపుట్టిస్తున్నాయి.

బారతీయ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడిన సంస్థలు ఉద్యోగులపై కోత విధిస్తూ ..అమెరికాలో స్థానికంగా ఉద్యోగావకాశాలను పెంచుతున్నాయి. బలవంతంగా ఉద్యోగులపై వేటు వేస్తుండడంతో పింక్ స్లిప్ లు అందుకొన్న కొందరు లేబర్ కమిషనర్లను కూడ ఆశ్రయించారు.

English summary
Tech Mahindra vice chairman warned that U.S. President Donald Trump's visa policies will damage the industry as his company reported weak earnings and his stock fell the most in almost two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X