వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా హత్యకి ప్లాన్!: వ్యక్తి అరెస్ట్, కత్తులు స్వాధీనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హత్యకు పన్నాగం పన్నుతున్నాడన్న ఆరోపణలతో మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మసాచుసెట్స్‌కు చెందిన ఆండ్రూ జే ఒకెఫే (28).. తాను ఒబామాను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎఫ్‌బీఐ వెబ్ సైట్లో లేఖ రాశాడు.

దీంతో ఒకెఫెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి ఇంటి నుంచి కత్తులు, ఈటెలు, రైఫిల్ వంటి వందకు పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Another man charged with threatening to kill President Obama

కాగా, అధ్యక్షుడిని హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి. ‘అధ్యక్షుడు ఒబామాను హత్యచేసేందుకు ప్రణాళిక వేస్తున్నా. అందుకు నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ కూడా ఉంది' అంటూ అతను పోస్ట్ చేశాడు.

అంతకుముందు, అతన్ని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులను లోపలికి రానివ్వకుండా లోపలి నుండే గంటకుపైగా మాట్లాడాడు. ఆ తర్వాత ఎలాంటి ప్రతిఘటన లేకుండా లొంగిపోయాడు కానీ ఇంటిముందు మాట్లాడటానికి మాత్రం నిరాకరించాడు.

English summary
A 28-year-old man, whose home was filled with swords, spears and other deadly weapons, has been charged with threatening to kill US President Barack Obama, the second such case that has come to light within a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X