వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడి మీద అడుగుపెట్టిన చివరి వ్యోమగామి కన్నుమూత..

సెర్నాన్ మొత్తం మూడుసార్లు అంతరిక్ష యానానికి సారథిగా వ్యవహరించారు. చంద్రుడిపై కాలు మోపిన చివరి వ్యక్తి సెర్నాన్ మరణించడం తీవ్ర విచారానికి గురిచేస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ట్విట్టర్ ద్వా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: చంద్రుడిపై పాదం మోపిన చివరి వ్యోమగామి యూజీన్ సెర్నాన్ కన్నుమూశారు. 82ఏళ్ల ఆయన సోమవారం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిని నాసా కూడా ధ్రువీకరించింది.

కాగా, 'అపొల్లో 17' అంతరిక్ష నౌకకు సెర్నాన్ కమాండర్‌గా పనిచేశారు. డిసెంబర్ 1972లో దీన్ని చంద్రుడిపైకి పంపించగా.. చంద్రుని మీదకు అమెరికా పంపిన చివరి మానవ సహిత మిషన్ ఇదే కావడం గమనార్హం.

 Apollo Astronaut Eugene Cernan, Last Man to Walk on the Moon, Dies at 82

సెర్నాన్ మొత్తం మూడుసార్లు అంతరిక్ష యానానికి సారథిగా వ్యవహరించారు. చంద్రుడిపై పాదం మోపిన చివరి వ్యక్తి సెర్నాన్ మరణించడం తీవ్ర విచారానికి గురిచేస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఇటీవలి కాలంలో తరుచుగా అనారోగ్యానికి గురికావడం వల్లే సెర్నాన్ మృతి చెందినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

English summary
astronaut Gene Cernan, who as the commander of the final Apollo lunar landing mission in 1972 became known as the "last man on the moon," died on Monday (Jan. 16). He was 82.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X