వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

88 మంది ఉగ్రవాదులను అంతం చేసిన సైన్యం

|
Google Oneindia TeluguNews

కైరో: విదేశీయులను కిడ్నాప్ లు చేస్తు, బాంబు దాడులు చేస్తు దేశాన్ని అస్థిరపర్చాలనుకున్న ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచి వెయ్యాలని ఈజిప్టు ప్రభుత్వం భావించింది. వెంటనే ఉగ్రవాదులను అంతం చెయ్యాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది.

ఆదేశాలు వచ్చిన వెంటనే సైన్యం ఉగ్రవాదుల మీద విరుచుకుపడింది. కేవలం 12 రోజులలో 88 మంది ఉగ్రవాదులను అంతం చేశారు. అనేక మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Army says 88 terrorists Killed in Egypt

ఉగ్రవాదులకు చెందిన అనేక వాహనాలు ద్వంసం చేశారు. అంతే కాకుండ ఉగ్రవాదులకు చెందిన 40 వ్యాన్లు, 36 బైక్ లు స్వాదీనం చేసుకున్నామని ఆదివారం ఈ జిప్ట్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. జులై 11వ తేదిన కైరోలోని ఇటలి రాయబార కార్యాలయం దగ్గర ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు.

ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన ఈజిప్ట్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరి వేయ్యాలని నిర్ణయించింది. ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుదాడులు చేసి తుపాకి గుండ్ల వర్షం కురిపించింది. 2011లో హోస్నీ ముబారక్ పదవీచ్యుతుడైన తరువాత ఈజిప్ట్ లో ఉగ్రవాదం పురుడు పోసుకుని బలపడింది.

English summary
The Egyptian army has killed 88 militants in North Sinai between 20 and 31 July, the army's spokesman said in a statement Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X