వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెస్టింగ్ హౌస్ దివాళా: అమెరికా - భారత్ అణు విద్యుత్ ప్రాజెక్టులపై సందేహాల మబ్బులు

అణు ఇంధన వ్యాపారంలో అంతర్జాతీయంగా పేరొందిన అమెరికా సంస్థ ‘వెస్టింగ్‌హౌస్’ మనుగడ సంక్షోభంలో పడింది. దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల రుణభారంతో సతమతమవుతున్నట్లు ప్రకటిస్తూ బుధవారం న్యూయార్క్‌

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అణు ఇంధన వ్యాపారంలో అంతర్జాతీయంగా పేరొందిన అమెరికా సంస్థ 'వెస్టింగ్‌హౌస్' మనుగడ సంక్షోభంలో పడింది. దాదాపు వెయ్యి కోట్ల డాలర్ల రుణభారంతో సతమతమవుతున్నట్లు ప్రకటిస్తూ బుధవారం న్యూయార్క్‌లోని కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తమకు తాత్కాలికంగా పరపతిదారుల నుంచి రక్షణ కల్పించాలని కోరింది. వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ.. జపాన్‌లోని తోషిబాకు చెందిన అమెరికన్ విభాగం.

తమ సంస్థల వ్యవహారాలను చక్కదిద్దుకునేందుకు తాత్కాలికంగా వెసులుబాటు కల్పించే చాప్టర్ 11కు బోర్డు ఆమోదం తెలిపింది. నష్టాలను పరిమితం చేసుకునేందుకు తోషిబా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ పరిణామం అణు ఇంధన పరిశ్రమకు గట్టి దెబ్బ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రపంచంలోని అణురియాక్టర్లలో దాదాపు సగభాగం వెస్టింగ్‌హౌస్ టెక్నాలజీతో రూపొందినవే.

అమెరికా - భారత్ ప్రాజెక్టులపై నీలినీడలు.. చేయూతనిస్తామంటున్న అమెరికా ఎంబసీ
అమెరికాతో భారతదేశం కుదుర్చుకున్న అణు బంధంలో భాగంగా పౌర అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదిత ప్రాజెక్టుల భవితవ్యంపై అనిశ్చితి ఏర్పడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా భారత్‌కు అవసరమైన అణు ఇంధన సహకారంలో తాము వెనుకడుగు వేయబోమని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించడం గమనార్హం.

As Westinghouse Files for Bankruptcy, US Assures India over N-Cooperation

భారత్‌కు సాంకేతిక వాణిజ్య సహకారం అందించే విషయమై వెస్టింగ్ హౌస్ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. 'భారతదేశానికి లబ్ది చేకూర్చేందుకు అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఎపి 1000 టెక్నాలజీ సరఫరా చేయడమే మా ప్రథమ ప్రాథాన్యం. ఆరు కోట్ల మంది భారతీయులకు 'స్వచ్ఛ'మైన విద్యుత్ సరఫరా చేయాలన్న సంకల్పానికే కట్టుబడి ఉన్నాం' అని అమెరికా ఎంబసీ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే వెస్టింగ్ హౌస్ కు 800 మిలియన్ల అమెరికన్ల డాలర్ల ఆర్థిక సాయం కావాల్సి ఉంటుంది.

ఇప్పటికే నిర్మితమవుతున్న, ఒప్పందాలు కుదుర్చుకో‌కున్న ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రెండేండ్ల క్రితం ప్రధాని మోదీ, నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా అణు రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని అవగాహనకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు అణురియాక్టర్ల నిర్మాణానికి 2017 జూన్‌కల్లా ఒప్పందాలు ఖరారు చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుల భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.

2006లో తొషిబాతో జట్టు కట్టిన వెస్టింగ్ హౌస్

As Westinghouse Files for Bankruptcy, US Assures India over N-Cooperation

వైద్య పరికరాలు, గృహోపకరణ ఉత్పత్తులను అందించే జపాన్ సంస్థ తోషిబా 2006లో వెస్ట్‌హౌసింగ్‌తో జతకట్టింది. నాడు అణుశక్తి రంగంలో కొత్త శకాని‌కి నాంది పలుకుతామని ప్రకటించినా దశాబ్ది తర్వాత పరిస్థితి మారిపోయింది. గత డిసెంబర్ నుంచి షేర్ల విలువ సగానికి పైగా పడిపోయింది. జాప్యం, లెక్కల్లో తప్పులు అక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ కొత్తగా భారత్, బ్రిటన్ ప్రాజెక్టుల్లో భాగం పంచుకోనని తోషిబా ప్రకటించింది.

వేరు చేయనున్న వెస్టింగ్ హౌస్ దివాళా పిటిషన్

వెస్టింగ్ హౌస్ దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రెండు సంస్థల దారులు వేరు కానున్నాయి. గతేడాది ఏప్రిల్ - డిసెంబర్ మధ్య తమ రెండు సంస్థల మధ్య 4.3 బిలియన్ల నష్టం.. ప్రత్యేకించి అణు విద్యుత్ ప్రాజెక్టుల్లో 6.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని తొషిభా అంచనా వేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నష్టం రమారమీ 9 బిలియన్ల డాలర్లకు తాకొచ్చునని అంచనా.

English summary
New Delhi: Reaffirming its commitment to nuclear cooperation with India, the US Embassy on Wednesday made it clear that American government is closely monitoring developments at Westinghouse Electric Co and Toshiba Corporation after the US nuclear unit filed the Chapter 11 petition in the US Bankruptcy Court of New York.Japan's embattled Toshiba Corp. said on Wednesday that its US reactor vendor Westinghouse has filed for bankruptcy protection, marking a key step in its struggles to stop the flow of massive red ink.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X