వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోతే ప్రాణాలు: సముద్రంలో బైక్ సర్ఫింగ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఆస్ట్రేలియా: ఏదైనా సాధించాలని పట్టుదల ఉంటే కచ్చితంగా సాధిస్తామని ఇతను నిరూపించాడు. బైక్ తో సముద్రంలో సర్ఫింగ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పోతే ప్రాణాలే కదా, లేదంటే గిన్నిస్ బుక్ రికార్డు వస్తుంది కదా అని తెగించాడు.

ఆస్ట్రేలియాకు చెందిన డేర్ డెవిల్ రోబ్బీ మాడిసన్ (34) బైక్ తో సముద్రంలో సర్ఫింగ్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. రోబ్బీ మాడిసన్ కు చిన్నప్పటి నుండి సముద్రంలో భీకర అలలు తప్పించుకుంటు సర్ఫింగ్ చెయ్యడం అలవాటు.

Australian Stunt rider Robbie Maddison

అయితే అందరూ సర్ఫింగ్ చేస్తారు, మనం కొత్తగా ఏదైనా చేద్దాం అని ఆలోచించాడు. అందుకు అవసరం అయిన కేటీఎం 250 ఎస్ఎక్స్ డర్ట్ బైక్ ను ఉపయోగించాడు. సముద్రంలో బైక్ నడపడానికి టైర్ లలో కోంచెం మార్పులు చేశానని మాడిసన్ ఎం టీవీ చానెల్ ఇంటర్వూలో చెప్పాడు.

తరువాత బైక్ ముందు టైర్ వద్ద సర్ఫింగ్ బోర్డు లాంటి ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేశాడు. అలల తాకిడి నుండి తప్పించుకునేందుకు బైక్ వేగం పెంచుకున్నాడు. బైక్ మీద అతని బరువు ఎక్కువ పడకుండా లైఫ్ సేఫ్ జాకెట్ వేసుకున్నాడు.

హెల్మెట్ లో సర్ఫ్ నురగను పెట్టుకున్నాడు. ప్రమాదం సంభవించే సమయంలో తప్పించుకోవడానికి బైక్ కు ప్రత్యేక లివర్ ఏర్పాటు చేశాడు. అంతే ఒక్క సారిగా సముద్రంలోకి దూసుకు వెళ్లాడు. భీకర అలలు తప్పించుకుంటు బైక్ నడిపాడు.

ఆ వీడియో తీసి పైప్ డ్రీమ్ అనే పేరుతో సోషల్ మీడియాలో పెట్టాడు. రోబ్బీ మాడిసన్ అనేక హాలివుడ్ సినిమాలలో నటించాడు. పలు హాలివుడ్ సినిమాలకు ఫైట్ మాస్టర్ గా, బైక్ రైడర్ గా పని చేశాడు. ప్రపంచంలో సముద్రంలో బైక్ తో సర్ఫింగ్ చేసిన మొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. త్వరలో మరో సాహసం చేస్తాను అంటున్నాడు.

English summary
Australian daredevil Robbie Maddison made waves around world with his incredible motorbike surfing video but he has admitted the stunt wasn't as seamless as it looks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X