వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుర్ర ప్రేమ జంటలు రాత్రి కనిపిస్తే పెళ్లి చేస్తారు

|
Google Oneindia TeluguNews

జకర్తా: కుర్ర ప్రేమ జంటలకు ఇండోనేషియాలో పెద్ద షాక్ ఇచ్చారు. నియమాలు అతిక్రమిస్తే చట్టపరంగా పెళ్లి చేస్తామని హెచ్చరించారు. ఇక మీద రాత్రి పోద్దు పోయిన తరువాత వరుసగా మూడు సార్లు కంటే ఎక్కువగా కలుసుకుంటే (డేటింగ్) ఈ నియమాలు వర్థిస్తాయి.

ఇండోనేషియా రాజధాని జకర్తా కు 100 కిలో మీటర్ల దూరంలోని పూర్వకర్త నగరం పాలకవర్గం ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకునింది. అక్టోబర్ 1వ తేది నుంచి ఈ నియమాలు అమలులో ఉంటాయని ప్రకటిచింది. 17 ఏళ్ల లోపు వారికి ఈ నియమాలు వర్థిస్తాయి. ఇప్పటి నుంచి ఈ నిర్ణయంపై ప్రచారం చేస్తున్నారు.

పూర్వకర్త నగరంలో టీనేజ్ ప్రేమపక్షుల ప్రణయ కార్యకలాపాలకు హద్దు అదుపులేకుండా పోయింది. వారి ఆగడాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పూర్వకర్త నగరం పాలకులు సరి కొత్త నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల తరువాత టీనేజ్ లవర్స్ కలుసుకోకూడదు.

 Ban teen dating after dark in Indonesia

టీనేజ్ లవర్స్ పై గస్తి దళాలు, సీసీ కెమెరాల నిఘా పెడుతారు. రాత్రి 9 గంటల తరువాత టీనేజ్ లవర్స్ కలుసుకుంటే వారికి విలేజ్ కల్చరల్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఇలా వరుసగా మూడు సార్లు హెచ్చరిస్తు కౌన్సిలింగ్
ఇస్తారు.

తరువాత కొత్త చట్టం ప్రకారం టీనేజ్ జంటకు పెళ్లి చేసి ఇంటికి పంపిస్తామని ఆదేశాలు జారీ చేశారు. పూర్వకర్త నగరంలో టీనేజ్ లవర్స్ డేటింగ్ కు కళ్లెం వెయ్యడానికి ఈ నియమాలు తీసుకువచ్చారు. ఇండోనేషియా మొత్తం ఈ చట్టం తీసుకురావాలని నాయకులు భావిస్తున్నారు.

English summary
To enforce the regulation Dedi Mulyadi, the head of Purwakarta district, said local patrols and new CCTV cameras would keep a watchful eye out for canoodling teenagers breaking the rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X