వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో మంటలు: 14మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా నుంచి థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌కు వెళుతున్న చైనీస్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఇంజిన్‌లో మంటలు రావడంతో చైనాలోని సాన్యా నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా దిగింది.

త్వరగా విమానం నుంచి బయటపడాలన్న ఆత్రుతతో ప్రయాణికులు హడావుడిగా బయటకు పరుగులు పెట్టడంతో 14 మందికి స్వల్పంగా గాయపడ్డారు. విమానం ఇంజన్‌లో మంటలు చెలరేగినట్లు గుర్తించడంతో పైలట్‌ అత్యవసరంగా దింపినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

Bangkok-Bound Flight From China Makes Emergency Landing

విమానం(3081)లోని 132 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడినట్టు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఎయిర్‌పోర్టు వైద్య కేంద్రంలో చికిత్స అందించారు.

కాగా, ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికులను వారి వారి గమ్యాలకు చేరవేసేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు విమానయాన అధికారులు తెలిపారు.

English summary
A Bangkok-bound flight operated by a Chinese airline made an emergency landing Friday afternoon after an engine fire warning lit up, China Southern Airlines said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X