వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాశనం చేస్తాం: భారతీయ బిలియనీర్‌కు బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిడ్నీ: తన క్లయింటును బ్యాంకు అధికారులు బెదిరిస్తున్నారని.. ప్రఖ్యాత భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ న్యాయవాది తెలిపారు. పంకజ్‌ ఓస్వాల్‌ను ఆస్ట్రేలియాలో బెదిరించిన కేసులో సుప్రీం కోర్టు ఆఫ్‌ విక్టోరియా విచారణ జరుపుతోంది.

బిలియనీర్‌ అయిన పంకజ్‌ ఓస్వాల్‌ను ఆస్ట్రేలియాలోని ఓ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బెదిరించారని, సంతకం పెట్టకపోతే నాశనం చేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన ఏడేళ్ల క్రితం... అంటే 2009లో జరిగింది. దీనిపై కేసు విచారణ జరుగుతోంది.

Bank Staff Threatened Indian Tycoon Pankaj Oswal, Says Lawyer

2009లో సదరు బ్యాంకు మాజీ చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ క్రిస్‌ పేజ్‌ భౌతికంగా దాడి చేసి పంకజ్‌ మెడపై ఆయుధం పెట్టి సంతకం పెట్టాలని బెదిరించాడని కథనాలు వచ్చాయి.

ఈ ఘటనపై పంకజ్‌, ఆయన భార్య రాధిక కేసు పెట్టారు. ఈ దంపతులు నష్టపరిహారంగా 2.5 బిలియన్‌ డాలర్లు ఇవ్వాలని దావా వేశారు. అయితే పంకజ, రాధికలు నకిలీ డాక్యుమెంట్లతో మోసానికి పాల్పడ్డారని బ్యాంకు ఆరోపిస్తోంది. వారు బకాయి ఉన్న 900 మిలియన్‌ డాలర్ల డబ్బు చెల్లించకపోతే జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతోంది.

English summary
Bank Staff Threatened Indian Tycoon Pankaj Oswal, Says Lawyer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X