వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలసదారుల పట్ల ఒబామా ఉదారం.. గన్‌తో మహిళ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా వలసదారుల పట్ల ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాస్తంత ఉదారంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన విదేశీయుల సేవలను వినియోగించుకునే విషయంలో... ఇలాంటి చర్యలు దేశానికి మరింత మేలు చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి వైట్ హౌస్‌లో ప్రసంగించారు.

వలసవాద చట్టాల్లో తాజా మార్పుల వల్ల భారత్, చైనాల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన 50 లక్షల మంది వలసదారులకు ఊరట లభించనుంది. ప్రసంగంలో తన వ్యతిరేకుల వ్యాఖ్యలను ప్రస్తావించని ఆ దేశ అధ్యక్షుడు.. వారి అభ్యంతరాలకు కూడా సమాధానం చెప్పాడు.

 Barack Obama enforces US immigration overhaul

ఇటీవల జరిగిన ఎన్నికల్లో అమెరికా చట్టసభలో రిపబ్లికన్ల మెజారిటీ పెరిగిన నేపథ్యంలో వలస వాద చట్టాల సవరణ ప్రశ్నార్థకంగా మారింది. ఐతే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తాను అనుకున్న వలవాద చట్టాల సవరణకు మరింత ధైర్యంగా ముందుకు అడుగువేశారు ఒబామా.

ఇది ఇలా ఉంటే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికార నివాసం వైట్ హౌస్ ముందు ఓ అత్యాధునిక గన్ పట్టుకొని ఓ మహిళ తిరగటంతో కలకలం రేగింది. అదే సమయంలో ఒబామా వైట్ హౌస్‌లోనే ఉండటంతో భద్రతా దళాలు ఆమెను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఆమెను మిచ్‌గాన్‌కు చెందిన లెహ్ నార్ట్‌గా గుర్తించామని... ఆమె వద్ద 9 ఎంఎం గన్ ఉన్నట్లు తెలిపారు. ఐతే ఆమె వెంట ఉన్న మరో వ్యక్తిని ఇంకా అరెస్టు చేయలేదని పేర్కొంది.

English summary
Millions of immigrants living illegally in the US will be allowed to apply for work permits under a major shake-up unveiled by President Barack Obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X