వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాంటి స్నానం జన్మలో చూసుండరు.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

అమెరికా : 'సోషల్ మీడియా..' పాపులారిటీకీ.. డబ్బు సంపాదనకీ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోన్న ప్రధాన మాధ్యమం. ఏం చేసైనా సరే.. నెటిజెన్స్ ఫాలోయింగ్ పెంచుకోవడం, తద్వారా డబ్బు సంపాదించుకోవడమే టార్గెట్ గా ఎంతటి దుస్సాహాసాలకైనా తెగిస్తోంది నేటి యువత. ఇదే తరహాలో ఏకంగా చిల్లీ సాస్ నింపిన టబ్ లో స్నానం చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడో వ్యక్తి.

1250 బాటిళ్ల చిల్లీ సాస్ ను ఓ బాత్ టబ్ లో నింపి.. అనంతరం అందులోకి స్నానానికి దిగిన అతగాడు, ఆ తర్వాత కొద్దిసేపటికే మంటను తాళలేక అరుపులు మొదలుపెట్టాడు. అయినా సరే అతి కష్టంగా శరీరాన్ని మొత్తం సాస్ లో ముంచేసిన అతగాడు.. భరించలేని మంటలు తాళలేక షవర్ కిందకు పరిగెత్తాడు. ఒంటికంటుకున్న సాస్ అంతా కడిగేసుకున్నాక.. అప్పుడు గానీ కాస్త ఉపశమనం దొరకలేదు.

స్టుపిడీ అని జనం తిట్టుకున్నా.. అతడు మాత్రం 25లక్షల వ్యూస్ తో అందరి ద్రుష్టిని ఆకర్షించగలిగాడు. అయితే తిట్టేవాళ్లు తిడుతున్నారు.. అయ్యో పాపం అనేవాళ్లు జాలి చూపిస్తున్నారు. ఏదేమైనా.. తినేప్పుడు కొద్దిగా కారం ఎక్కువయితేనే కళ్ల వెంబడి నీళ్లు ధారలు కడుతాయి.. అలాంటిది మిరపకాయల సాస్ లోనే స్నానం చేయమంటే..! సాహసం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే.

English summary
Seldom does the thumbnail on a YouTube clip tell you enough that you just have to find out what else happens in that video. This thumbnail is the rare exception.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X