వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిచ్చం వేస్తారా..! లేక ట్రంప్ కు ఓటేయమంటారా?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : ఎన్నికల వేళ నాయకులు వేసే ఎత్తుగడల గురించి తెలుసు. ఓటరు మహాశయులను తమవైపు తిప్పుకుని ఎన్నికల్లో గెలవడానికి అంతర్గతంగా ఎన్నెన్నో ఎత్తుగడలు వేస్తుంటారు నేతలు. ప్రత్యర్థి మహా ముదురు అయినప్పుడు ఆ ఎత్తుగడల్లో మరింత పదును ఉంటుంది. అయితే నాయకులే కాదు సందర్బం వస్తే.. ఓటర్లు, ఆఖరికి బిచ్చగాళ్లు కూడా ఆ ఎత్తుగడలను ప్రదర్శించగలరు.

తాజా అమెరికన్ ఎన్నికల్లోను ఇదే జరుగుతోంది. హిల్లరీకి పోటీగా అమెరికన్ ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై సోషల్ మీడియాలో విచిత్ర ప్రచారం జరుగుతోంది. బిచ్చం వేస్తారా లేక ట్రంప్ కు ఓటేయమంటారా.. అంటూ ఓ బెగ్గర్ అడుక్కోవడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. 'నాకొక డాలర్ దానం చేయండి.. లేదంటే ట్రంప్ కు ఓటేస్తా..' అన్న వాక్యాలతో తన ఎదురుగా ఓ బోర్డు పెట్టుకుని కూర్చోన్న బెగ్గర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Begger blackmails to vote trump if he not given a dollar

ఇదిలా ఉంటే, సోమవారం రాత్రి జరిగిన మొట్ట మొదటి అమెరికన్ ఎన్నికల చర్చలో ట్రంప్ పై హిల్లరీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. హిల్లరీకి 62శాతం మంది మద్దతు లభించగా, ట్రంప్ కు కేవలం 28శాతం మంది మద్దతు మాత్రమే లభించింది.

English summary
Its a strange publicity on trump in american social media that a beggear was demanding for 1 dollar other wise he wants to vote trump..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X