చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లివింగ్ కాస్ట్: జీవించేందుకు బెంగళూరు అతి చవకైన నగరం, ముంబై కూడా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: అంతర్జాతీయంగా.. జీవించేందుకు తక్కువ ఖర్చయ్యే నగరాల్లో భారత ఐటీ హహ్ బెంగళూరు ఉంది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్‌లో మిగతా నగరాల కంటే తక్కువే. ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్.. ప్రపంచవ్యాప్తంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ రిపోర్ట్ 2015 ప్రకారం.. బెంగళూరుతో పాటు చెన్నై, న్యూఢిల్లీ, ముంబైలో కూడా కాస్ట్ ఆప్ లివింగ్ తక్కువే.

భారత్‌కు చెందిన నాలుగు నగరాలు లివింగ్ కాస్ట్‌లో చివరి స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 133 నగరాలలోని లివింగ్ కాస్ట్‌ను తీసుకున్నారు. న్యూయార్క్‌ను అందుకు బేస్‌గా తీసుకున్నారు.

Bengaluru, Karachi cheapest cities to live in

లివింగ్ కాస్ట్ వైజ్.. టాప్‌లో సింగపూర్ ఉంది. అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ ఉండటం ఇది వరుసగా రెండో ఏడాది. ముంబై 130వ స్థానంలో, చెన్నై 129వ స్థానంలో, న్యూఢిల్లీ 128వ స్థానంలో ఉన్నాయి.

టాప్ అయిదులో ప్యారిస్, ఓస్లో, జ్యూరిచ్, సిడ్నీలు ఉన్నాయి. జెనీవా, కోపెన్‌హెగ్, ఫ్రాంక్రప్ట్, హెల్సింకీలు టాప్ 10లో ఉన్నాయి. టాప్ టెన్‌లో ఉన్న ఆసియా నగరాల్లో హాంగ్ కాగ్, సియోల్‌లు ఉన్నాయి. లండన్ 11వ స్థానంలో ఉంది. గత ఏడాది వరకు టాప్ స్థానంలో ఉన్న టోక్యోను సింగపూర్ వెనక్కి నెట్టింది.

కాగా, ఈ సర్వే కోసం 160 ఉత్పత్తుల లేదా సేవలను పరిగణలోకి తీసుకున్నారు. అందులో ఆహారం, డ్రింక్స్, బట్టలు, గృహోపకరణాలు, పర్సనల్ కేర్ ఐటమ్స్, ఇంటి అద్దె, రవాణా, వివిధ రకాల బిల్స్, ప్రయివేటు పాఠశాలలు, డొమెస్టిక్ హెల్ప్ తదితరాల ప్రాతిపదికన సర్వే చేశారు.

English summary
India’s IT hub Bengaluru and Pakistan’s financial capital Karachi have emerged as the world’s cheapest cities to live in, according to a new global survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X