వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను గెలిచినట్లు ప్రకటించండి: మళ్లీ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఎన్నికల సమయంలో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలను రద్దు చేయాలని, తనను విజేతగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అనుసరిస్తున్న విధానాలు చాలా చెత్తగా ఉన్నాయని ఆరోపించారు.

అమెరికాలో ఎన్నికలకు మరో రెండు వారాల గడువు ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మునుపెన్నడూ లేనంత ఆసక్తిగా సాగుతోంది. ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రత్యర్థిపై వ్యంగ్య బాణాలు విసురుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఎన్నికలు రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలన్నారు.

ఇదీ లెక్క: కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్‌దే విజయం!ఇదీ లెక్క: కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్‌దే విజయం!

Cancel elections and declare me winner: Donald Trump

పలు సర్వేల్లో ఆయన హిల్లరీ కంటే కొంచెం వెనుకంజలో ఉన్నారు. మనం ఎన్నికలు రద్దుచేసి ట్రంప్‌కు అధ్యక్ష పదవి ఇచ్చేద్దామని నా ఆలోచన అని ఒహాయో ప్రచారంలో ట్రంప్‌ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె (హిల్లరీ) విధానాలు బాగా లేవని, తేడా ఏమన్నా కనిపిస్తోందా అన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన అధ్యక్ష ఎన్నికల చట్టబద్ధత గురించి ప్రశ్నించారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరుగుతుందని, మీడియా, కొందరు రాజకీయ నాయకులు తన ప్రచారంపై కుట్రలు పన్నుతున్నారన్నారు. క్లింటన్‌ శక్తిమంతురాలు కాదని, అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేంత దమ్ము లేదన్నారు.

English summary
Republican presidential candidate Donald Trump, who is still trailing his opponent Hillary Clinton two weeks from Election Day, said he'd like to "cancel the election" and be declared the winner, media reports said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X