వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా జోలికొస్తే దండయాత్రే: చైనా అధ్యక్షుడి హెచ్చరిక

చైనా ఎప్పుడూ త‌మ‌ సార్వ‌భౌమ‌త్వం, భ‌ద్ర‌త‌, అభివృద్ధి ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డ‌బోద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ స్ప‌ష్టంచేశారు. మంగ‌ళ‌వారం ఆర్మీ డే సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు మరోసారి పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

చైనా ఎప్పుడూ త‌మ‌ సార్వ‌భౌమ‌త్వం, భ‌ద్ర‌త‌, అభివృద్ధి ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డ‌బోద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ స్ప‌ష్టంచేశారు. మంగ‌ళ‌వారం ఆర్మీ డే సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

మా జోలికొస్తే..

మా జోలికొస్తే..

అంతేగాక, తమ జోలికొస్తే ఎవరిపైనైనా దండయాత్ర తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా డోక్లాం ప్రాంతంలో మనదేశంతో ఏర్ప‌డిన ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ‘చైనా ప్ర‌జ‌లు శాంతినే కోరుకుంటారు. దూకుడుగా ఉండ‌టం, రాజ్యాన్ని విస్త‌రించే ఆలోచ‌న‌లు మాకు లేవు. కానీ, మా భూభాగంలో చొర‌బాట్ల‌ను తిప్పికొట్టే సామ‌ర్థ్యం ఉంది. మా భూభాగం నుంచి చిన్న భాగాన్ని కూడా విడ‌దీసే అవ‌కాశం ఎవ‌రికీ, ఎప్ప‌టికీ క‌ల్పించం' అని జిన్‌పింగ్ తేల్చి చెప్పారు.

Recommended Video

Sikkim Standoff: India firm on supporting Bhutan and not appease China | Oneindia News
ఉపేక్షించేది లేదు..

ఉపేక్షించేది లేదు..

పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ(పీఎల్ఏ) 90వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించిన సంబ‌రాల్లో జిన్‌పింగ్ పాల్గొన్నారు. త‌మ‌ సార్వ‌భౌమాధికారానికి హాని క‌లిగించే ఎలాంటి చ‌ర్య‌ల‌ను ఉపేక్షించ‌బోమ‌ని జిన్‌పింగ్ స్ప‌ష్టంచేశారు. పీఎల్ఏ సంబ‌రాల్లో చైనాతోపాటు ఇండియా, భూటాన్ ప్ర‌తినిధులు కూడా పాల్గొన్నారు.

చైనా అసత్య ఆరోపణలు

చైనా అసత్య ఆరోపణలు

1962 యుద్ధం త‌ర్వాత నెల రోజులకు పైగా ఇండో-చైనా మ‌ధ్య ఇంత ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డం ఇదే తొలిసారి. డోక్‌లామ్‌లోకి భార‌త బ‌ల‌గాలే చొచ్చుకొచ్చాయని చైనా ఆరోపిస్తుండ‌గా.. వివాదాస్ప‌ద ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న అక్ర‌మ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామ‌ని భార‌త్ స్పష్టం చేసింది. చైనా అసత్య ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

భారత్‌లోకి చొచ్చుకొచ్చి ఇప్పుడిలా..

భారత్‌లోకి చొచ్చుకొచ్చి ఇప్పుడిలా..

ఓ వైపు ఈ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న స‌మ‌యంలోనే ఉత్త‌రాఖండ్‌లోని బారాహోతిలోకి 50 మంది చైనా సైనికులు దూసుకు రావ‌డం రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను మ‌రింత ఉద్రిక్తతకు దారితీసింది. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలు చూస్తుంటే చైనా యుద్ధానికి కూడా వెనుకాడే అవకాశాలు లేవనే తెలుస్తోంది. భారత్ ఇప్పటికే దీనిపై చైనాకు పలుమార్లు ఘాటుగా జవాబిచ్చింది.

English summary
Reiterating his words, Chinese President Xi Jinping on Tuesday said his country would never compromise on its sovereignty and security and its Army had the confidence to defeat all invasions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X