వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిడ్స్ డే ప్రత్యేకం: చైనాలో అత్యధిక కేసులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డిసెంబర్ 1వ తేదీన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మొట్టమొదటిసారి 1981 జూన్‌లో అమెరికాలో ఈ ఎయిడ్స్ వ్యాధి వెలుగు చూసింది. గడచిన 34 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర కోట్ల మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారినపడ్డారు.

అందులో నాలుగు కోట్ల మంది మరణించారు. 2015 జూన్ అంచనాల ప్రకారం 3 కోట్ల 69 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే ప్రతేడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ దేశాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం వివిధ రకాల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కాగా, భారత్‌లో 2011 డిసెంబర్‌ నాటికి 24 లక్షలు, 2013 చివరి నాటికి 21 లక్షల మంది హెచ్‌ఐవీ బారినపడినట్లు భారత్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సంస్థ ‘యూఎన్ ఎయిడ్స్'కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డట్లు రికార్డుల్లో నమోదైంది.

China has 5.75 lakh people with HIV/AIDS

తెలుగు జనాభా దేశంలో దాదాపు 6 శాతం అయితే, భారత్‌లోని హెచ్‌ఐవీ రోగుల్లో 20 శాతంపైగా తెలుగువారున్నారు. ఇది ఇలా ఉంటే, చైనాలో అధికంగా 5లక్షల 75 వేల మంది హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ బారిన పడినట్లు చైనీస్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ ఏడాది అక్టోబర్ ముగిసే నాటికి చైనాలో ఎయిడ్స్ బారిన పడి వారిలో 1.77 లక్షల మంది చనిపోయినట్టు పేర్కొంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు చైనాలో ప్రతీ 10 వేల మందిలో ఆరుగురు హెచ్‌ఐవీ/ఎయిడ్స్ బారిన పడ్డారని చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గణాంకాల్లో వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఎక్కువగా లైంగిక సంబంధాల వల్లే నమోదైనట్లు చైనా స్పష్టం చేసింది.

ఎయిడ్స్ ఎలా వస్తుంది?
* కలుషిత రక్త మార్పిడి: హెచ్‌ఐవీ ఉన్న వారి రక్తం వేరొకరికి ఎక్కించడం ద్వారా
* వాడేసిన సిరంజులు ఉపయోగించడం: ఎయిడ్స్ రోగికి వాడిన సిరంజులు ఇతర పేషెంట్లకు వాడటం
* గర్భంతో ఉన్న తల్లి నుంచి బిడ్డకు: గర్భం దాల్చిన తల్లికి ఎయిడ్స్ సోకినప్పుడు పిండానికి జరాయువు ద్వారా సోకుతుంది.
* లైంగింక సంబంధాలు: లైంగిక సంబంధాల వల్లే ఎయిడ్స్ వ్యాధికి ప్రధాన కారణం.

ఎయిడ్స్ లక్షణాలేంటి?
మొదటి దశ: తీవ్ర జ్వరం, డయేరియా, శరీర బరువు వెంటనే 10శాతం తగ్గిపోవడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు.
రెండవ దశ: ఇది సంక్రమణకు క్లినికల్ లక్షణాలకు మధ్య దశ. దాదాపు కొన్ని వారాల నుంచి 13 సంవత్సరాల పాటు ఉంటుంది.
మూడో దశ: శోషరస గ్రంథులు వాపునకు గురవుతాయి.
నాలుగోదశ: ఎయిడ్స్ వ్యాధికి సంబంధించి ద్వితీయ లక్షణాలు కనిపిస్తాయి.
ఐదవ దశ: త్రాంబోసైట్ పేనియాలు సాధారణంగా కనిపిస్తాయి. కపోస్సేస్ సార్కోమా లక్షణాలు బయటపడతాయి.

ఎయిడ్స్‌కు ఏయే పరీక్షలు చేస్తారు?
* ఎలిసా పరీక్ష
* వెస్ట్రన్ బ్లాస్ట్ టెస్ట్

English summary
The number of people living with HIV/AIDS in China has hit 5,75,000 by the end of October, with 1,77,000 deaths, a Chinese health agency said ahead of the World AIDS day .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X