వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకోండి: చైనా ఏవియేషన్ ఆదేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఆంగ్లంలోనే మాట్లాడాలని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సీఏఏసీ) ఆదేశాలు జారీ చేసినట్లుగా మంగళవారం మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడే కాదు.. 2017 నుంచి పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ మధ్య ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేషన్ ఉండాలని ఆదేశించింది.

సాధారణంగా చైనాలో ఇంగ్లీషు వాడకం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 2017 నుంచి చైనా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడుకోవాలని చైనా పౌర విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనా పైలట్లకు ఇంగ్లీషులో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు.

China pilots, air traffic controllers to use only English

అయితే, ఇంగ్లీషు నేర్చుకోవడం వారికి తలకు మించిన భారంగా పరిణమించింది. ఎలా నేర్చుకోవాలో, ఎలా మాట్లాడాలో అర్థంకాక పైలట్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విదేశీ పైలట్లకు ఇంగ్లీషులో సూచనలు ఇస్తుండగా, చైనా పైలట్లకు మాత్రం మాండరిన్ భాషలో చెబుతున్నారు.

English summary
The Civil Aviation Administration of China (CAAC) has ordered communication between pilots and air traffic controllers would be only in English starting from 2017, the media reported on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X